అలా నోటితో ఊదీ...భర్తను  కాపాడుకొన్న మహిళ


ప్రాణాల మీదకు వచ్చినపుడు అప్రమత్తంగా వ్యవహరిస్తే వ్యక్తిని కాపాడవచ్చు అన్నది మరోసారి రుజువైంది. ఇదిలావుంటే ఓ మహిళ తన నోటి ద్వారా ఊపిరి అందించి... భర్తను రక్షించుకుంది. ఈ అరుదైన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. కేశవన్ (67) అనే వ్యక్తి తన భార్య దయాతో కలిసి కోయంబత్తూరు ఎక్స్‌ప్రెస్ రైలులో ఢిల్లీ నుంచి కోజికోడ్‌కు వెళ్తున్నారు. రైల్లోని బీ4 కోచ్‌లోని సీటు నంబర్ 67-68లో ప్రయాణిస్తున్న కేశవన్ అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత అతడిని ఇతర ప్రయాణికులు మథుర స్టేషన్‌లో దించి రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ సిబ్బందికి సమాచారం అందించారు. అతనికి గుండె పోటు వచ్చిందని గుర్తించిన రైల్వే సిబ్బంది.. వెంటనే అప్రమత్తమయ్యారు.

రైలు ఆగిన వెంటనే మధుర స్టేషన్‌లో కేశవన్‌ను కిందకు దించారు. అప్పటికే ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉంది. కష్టంగా ఊపిరి తీసుకుంటున్నారు. ఈ విషయం అర్థమై ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అశోక్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అతను ప్రయాణికుడి భార్యను తన భర్తకు నోటి ద్వారా శ్వాస ఇవ్వమని చెప్పాడు. దాంతో ఆయన భార్య భార్య 33 సెకన్ల పాటు సీపీఆర్ ఇచ్చి భర్తను మృత్యువు బారిన పడకుండా కాపాడింది. మరోపక్క కానిస్టేబుల్ కూడా ప్రయాణికుడికి సపర్యలు చేశాడు.

అంతకుముందే రైల్వే పోలీసులు అశోక్‌కుమార్‌, నిరంజన్‌సింగ్‌ అంబులెన్స్‌ను పంపాల్సిందిగా కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం ఇచ్చారు. భార్య సీపీఆర్‌ అనంతరం ప్రయాణికుడు కేశవన్‌ను స్ట్రెచర్‌ నుంచి బయటకు తీసుకొచ్చి అంబులెన్స్‌లో రైల్వే ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని, వేరే ఆస్పత్రికి తీసుకెళ్లమని అక్కడి వైద్యులు చెప్పారు. దాంతో అతడిని నగరంలోని వేరే ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో కేశవన్ గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన చికిత్స పొందుతున్నట్లు డాక్టర్లు చెప్పారు.

తాము కేరళ జిల్లాలోని కాసర్‌గోడ్‌‌లో ఉంటున్నామని, రెండు వారాల క్రితం 80 మందితో కూడిన బృందం చార్ ధామ్ యాత్రకు ఉత్తరాఖండ్ వెళ్లామని కేశవన్ భార్య దయ చెప్పారు. ఇంతలో ఇలా జరిగిందని వెల్లడించారు. కేశవన్ కొడుకు నీరజ్ కూడా సహరన్‌పూర్‌లో డాక్టర్. తండ్రి విషయం తెలుసుకుని.. ఆయన కూడా మధుర చేరుకున్నారు. కాగా భార్య భర్తకు.. నోటితో శ్వాస ఇచ్చిన ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: