పేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు..

అన్నలా.. మేనమామలా అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్

విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జాను జాకో వెబ్ న్యూస్-జల్ పల్లి ప్రతినిధి)

కళ్యాణ లక్ష్మి,షాది ముబారాక్ పథకాలతో పేదింటి అడబిడ్డల పెళ్ళిళ్ళకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక పెద్ద అన్నలాగా, ఒక మేన మామ లాగా అండగా ఉంటున్నారని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం జల్పల్లి మునిసిపాలిటీలో 126 మంది లబ్ధిదారులకు షాది ముబారక్, కళ్యాణ లక్ష్మీ చెక్కు లను  ప్రదానం చేశారు. సుమారు ఒక కోటి 26 లక్షల 16 వెలు రూపాయలకు సంభందించి చెక్కులను అందించి,నూతన జంటలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ 4 ఏళ్లలో  జల్పల్లి మునిసిపాలిటీలో 2405 మందికి చెక్కులు అందించినట్లు తెలిపారు,7 వేల మందికి మహేశ్వరం నియోజకవర్గములో లబ్ది చేకూరినట్లు మంత్రి వెల్లడించారు. ఇంత పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రజల తరుపున మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి పథకం అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం మనది అని అన్నారు.దేశంలోని ఏ ఇతర రాష్టాల్లో ముఖ్యంగా 


బీజేపీ పాలిత రాష్టాల్లో కల్యాణ లక్ష్మి,షాది ముబారాక్, రైతు బంధు,రైతు భీమా, మిషన్ భగీరథ ద్వారా  ఇంటింటికి  నీరు లాంటి పథకాలు, కార్యక్రమాలు చేపడుతున్నారా అని మంత్రి ప్రశ్నించారు. నల్గొండలో ముఖ్యంగా మునుగోడు లాంటి ప్రాంతంలో ఫ్లోరైడ్ ను తరిమికొట్టి,ప్రజలకు రక్షిత మంచినీరు అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ని ప్రజలు ఎన్నటికీ మర్చిపొరన్నారు. మన ప్రాంతంలో కూడా సుమారు 100 కోట్లతో ఇంటింటికి నీరు అందించే కార్యక్రమం చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అబ్దుల్లా సాది , వైస్ చైర్మన్ ఫర్హ నాజ్, కౌన్సిలర్లు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.




Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: