బిజెపితోనే తెలంగాణ భవిష్యత్తు

బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్

మునుగోడు అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కలిసి ప్రచారం

(జానో జాగో వెబ్ న్యూస్- మునుగోడు ప్రతినిధి)

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు కుటుంబ అవినీతి పెరిగిపోతోందని బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ విమర్శించారు. అందుకే రాష్ట్రంలో ఆ కుటుంబ పాలన పారదోలాలని, మునుగోడు లో బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపుతోని అది ప్రారంభం కావాలని ఆయన వెల్లడించారు.


మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో "భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి"తో కలిసి గట్టుప్పల్ మండల్ తారెడ్ పల్లి గ్రామంలో బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ ప్రచారం నిర్వహించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ సంక్షేమ పథకాలను ఈ సందర్భంగా ఓటర్లకు వివరించారు. అలాగే కేసిఆర్ ప్రభుత్వ అవినీతి పాలనను గడప గడప తిరిగిన బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ వివరించారు. ఈసారి తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆయన వెల్లడించారు. మునుగోడులో బిజెపి అభ్యర్థి గెలుపుతోననే అది ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు.









Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: