వివాదాల్లో చిక్కుకొన్న ఆప్ మంత్రి రాజీనామా
ఢిల్లీ ప్రభుత్వంలోని ఓ మంత్రి తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల మత మార్పిడి కార్యక్రమంలో పాల్గొన్న ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ ఢిల్లీ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ కేబినేట్ నుంచి వైదొలిగారు. మత మార్పిడి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఓ వర్గం వారి మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపిస్తూ బీజేపీ, వీహెచ్‌పీలు మంత్రిపై విరుచుకుపడ్డాయి. మత మార్పిడి కార్యక్రమంలో ఏకంగా ఓ మంత్రి పాల్గొనడం సిగ్గు చేటని విమర్శించాయి. అంతేకాదు, ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశాయి. విమర్శల సుడిగుండంలో చిక్కుకున్న రాజేంద్రపాల్ గౌతమ్ నిన్న తన పదవికి రాజీనామా చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు తాను సంకెళ్ల నుంచి విముక్తి పొందానని అన్నారు. ఈ రోజు తాను మళ్లీ పుట్టానని, ఇకపై ఎలాంటి ఆంక్షలు లేకుండా హక్కుల కోసం, సమాజంపై జరిగే దౌర్జన్యాల విషయంలో మరింత గట్టిగా పోరాడతానని అన్నారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని ట్విట్టర్‌లో షేర్ చేశారు. అంతేకాదు, ఇటీవలి వ్యవహారంలో బీజేపీ తనతోపాటు కేజ్రీవాల్‌ను కూడా లక్ష్యంగా చేసుకోవడం బాధాకరమన్నారు. బీజేపీ నీచ రాజకీయాలకు నిరసనగానే తన పదవికి రాజీనామా చేసినట్టు రాజేంద్ర పాల్ గౌతమ్ పేర్కొన్నారు.
Home
Unlabelled
వివాదాల్లో చిక్కుకొన్న ఆప్ మంత్రి రాజీనామా
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: