అందుకే మేం క్షిప‌ణి దాడులు చేశాం: పుతిన్


ఉక్రెయిన్ త‌మ‌ను రెచ్చ‌గొట్టేలా ఉగ్ర‌వాద దాడుల‌కు పాల్ప‌డింద‌ని, అందుకు ప్ర‌తిగానే ఉక్రెయిన్‌పై త‌మ దేశం క్షిప‌ణి దాడులు చేసింద‌ని  ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్ల‌డించారు. ఉక్రెయిన్ ఇక‌నైనా ఈ త‌ర‌హా ఉగ్ర దాడుల‌కు పాల్ప‌డ‌రాద‌ని, త‌మ సూచ‌న‌ల‌ను బేఖాత‌రు చేస్తే... ఆ దేశంపై మ‌రింత‌గా విరుచుకుప‌డ‌తామ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. 

ర‌ష్యా సెక్యూరిటీ కౌన్సిల్ స‌మావేశంలో భాగంగా సోమ‌వారం పుతిన్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. క్రిమియాతో ర‌ష్యాను అనుసంధానం చేసే కెర్బ్ వంతెన ఇటీవలి పేలుడు కార‌ణంగా కూలిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌కు ఉక్రెయినే కార‌ణ‌మ‌ని పుతిన్ ఆరోపించారు. కెర్బ్ వంతెన కూల్చివేత ముమ్మాటికీ ఉగ్ర చ‌ర్యేన‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. ఉక్రెయిన్ ఉగ్ర చ‌ర్య‌కు పాల్ప‌డినందున‌నే ఆ దేశంపై క్షిప‌ణి దాడులు చేయాల్సి వ‌చ్చింద‌ని పుతిన్ వెల్ల‌డించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: