బాల్య వివాహాలకు వ్యతిరేకంగా 

నంద్యాలలో .క్యాండిల్ లైట్ ర్యాలీ

(జానో జాగో వెబ్ న్యూస్ -నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా స్త్రీ సంక్షేమ శాఖ అధికారిణి శ్రీమతి శారదా గారి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నుండి సంజీవనగర్ గెట్ వరకు బాల్య రహిత భారతదేశం అనే నినాదంతో ర్యాలీ నిర్వహించారు. సంజీవనగర్ సెంటర్లో క్యాండీల్స్ పట్టుకుని బాల్య వివాహాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ దాస్, రెడ్ క్రాస్ చైర్మన్ పర్ల దస్తగిరి , బర్డ్స్ స్వచ్ఛంద సంస్థ పాల్ రాజారావు, జ్యుడీషియల్ సిబ్బంది, పోలీసు సిబ్బంది, వరల్డ్ విజన్, మదర్ సంస్థ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అంగన్వాడీ అధికారులు, సూపరువైజర్లు, సిబ్బంది, రెడ్ క్రాస్ జిల్లా కమిటీ సభ్యులు తెలకపల్లి చైతన్య, సీనియర్ సభ్యులు నాగరాజు, డీఎఫ్ఓ రాజునాయక్  పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: