ఎరువుల దుకాణాలను..

అకస్మికంగా తనిఖీ చేసిన విజిలెన్స్ అధికార్లు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

ఎరువులు, ఫెస్టిలైజర్ దుకాణాలపై విజిలెన్స్ అధికార్లు అకస్మికంగా తనిఖీ చేపట్టారు.  ఈ సందర్బంగా వారు కాలపరిమితి దాటిన ఫెస్టిసైడ్స్ ను స్వాధీనం చేసుకొన్నారు. వివరాలలోకి వెళ్లితే...నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని ఎరువులు, ఫెస్టిలైజర్ పై శంకర్ ప్రతాప్ బాక్షి ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు కర్నూలు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా డీఎస్పీ సుధాకర్ రెడ్డి, బృందం, గడివేముల మండల వ్యవసాయ అధికారి హామసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో గడివేముల మండలంలోని ఎరువులు, పురుగు మందులు దుకాణాలను తనిఖీ చేసి కమల్ ట్రేడర్స్ ఎరువుల మందుల దుకాణానికి సంబంధించిన సిన్ జంట ఇండియా లిమిటెడ్ వారి " అమిస్టార్ " మరియు "అమిస్టార్ టాపు 10 " బాటిల్లో ఒక్కొక్కటి 200 ఎం.ఎల్. 2022 ఐదవ నెలకు మందుల కాల పరిమితి దాటడంతో కావడంతో వాటి స్వాధీనం చేసుకున్నారు.


వాటి విలువ 12,290 రూపాయలు అనిి, వాటిని స్వాధీనం చేసుకొని  కోర్టు ఉత్తర్వుల కోసం గడివేములో ఎమ్మార్వోకు అప్పగించారు. తనఖి లలో డీఎస్పీ సుధాకర్ రెడ్డి, ఎస్సై జయన్న, డి ఏ ఓ షణ్ముఖ గణేష్, వేణు, హేమ సుందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.






Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: