ప్రతి గ్రామంలో ఇంటి పన్నులు వసూలు చేయండి
గడివేముల ఎంపీడీవో విజయ సింహారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని ఎంపీడీవో కార్యాలయం నందు ఎంపీడీవో విజయసింహారెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పంచాయతీ కార్యదర్శులతో మాట్లాడుతూ ప్రతి గ్రామంలో నవంబర్ ఒకటో తేదీ నుండి ఇంటి పన్నులు తప్పనిసరిగా వసూలు చేయాలని, గ్రామపంచాయతీ లో పనిచేస్తున్న పరిశుద్ధ కార్మికులకు జీతాలు చెల్లించాలని, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి నీళ్ల ట్యాంకులు తప్పనిసరిగా 02 తేదీ మరియు 17వ తేదీన శుభ్రం చేసి , శుభ్రం చేసిన తారీకును తప్పనిసరిగా ట్యాంకుల వద్ద ప్రజలందరికీ కనపడేలా వ్రాయాలని
గ్రామంలో పారిశుద్ధ్యం లేకుండా తప్పని సరిగా విధులు నిర్వహించాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయసింహారెడ్డి, ఇఓఆర్డి ఖాళిక్ బాషా, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
Home
Unlabelled
ప్రతి గ్రామంలో ఇంటి పన్నులు వసూలు చేయండి... గడివేముల ఎంపీడీవో విజయ సింహారెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: