సభ్యసమాజం తలదించుకొనేలా వ్యవహరిస్తున్నారు


ఇటీవల పలు చోట్ల ఉపాధ్యాయుల తీరు వివాదాస్పదంగా మారుతోంది. రోజుకో రీతిలో ఉపాధ్యాయుల లీలలు వెలుగులోకి వస్తున్నాయి. మన దేశంలో ఉపాధ్యాయ వృత్తిపై ఎంతో గౌరవం ఉంది. ఎందుకంటే తల్లిదండ్రుల తర్వాత.. పిల్లలకు అన్ని నేర్పించి.. వారిని తీర్చిదిద్దేది గురువులే. కానీ కొంతమంది టీచర్లు ఆ వృత్తికి కళంకం తెచ్చేలా ప్రవర్తిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఉపాధ్యాయులు క్లాస్ రూమ్‌లోనే అసభ్యంగా ప్రవర్తించడం, విద్యార్థుల పట్ల అనుచితంగా వ్యవహరించడం వంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అంతేకాదు కొంతమంది పిల్లల పట్ల కర్కశంగా ప్రవర్తిస్తే.. మరికొందరు తరగతి గదిలోనే మద్యం సేవిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఇదే జరిగింది.

హత్రాస్ నగరంలోని ఓ పాఠశాలలో అసిస్టెంట్ టీచర్ శైలేంద్ర సింగ్ గౌతమ్ విద్యార్థుల ఎదుట మద్యం మత్తులో కనిపించాడు. పైగా తన డెస్క్ దగ్గరే మరో బీరు బాటిల్‌ను ఉంచుకున్నాడు. క్లాస్‌రూమ్‌లో ఒక పక్క విద్యార్థులకు పాఠాలు చెబుతూనే.. మరో పక్క బీరు తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన ప్రవర్తనతో విసిగిపోయిన కొందరు ఆయనపై తీరుపై వీడియో తీశారు. శైలేంద్ర సింగ్ పాఠాలు చెప్పే పద్ధతిని.. వీడియో తీసి.. బయటపెట్టారు. ఆ వీడియోలో తన దగ్గరే బీరు డబ్బాను పట్టుకుని ఉండడం చూడొచ్చు.

అయితే ఈ వీడియో తీసిన వారిని టీచర్ శైలేంద్ర సింగ్ విరుచుకుపడ్డాడు. మీకు కావాల్సినన్ని వీడియోలు తీసుకోండి అంటూ కేకలు వేశాడు. ఇలాంటివి తనను భయపెట్టావని కూడా అన్నాడు. మరోవైపు టీచర్ శైలేంద్ర గురించి తెలియడంతో.. జిల్లా మేజిస్ట్రేట్ కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను, పాఠశాల ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. ఈ మేరకు నిందితుడిని సస్పెండ్‌ చేసి విచారణ చేపట్టారు. అంతేకాదు దీనిపై ముగ్గురు సభ్యుల కమిటీ వేశారు. ఆ కమిటీ విచారణ చేపట్టనుంది. అసిస్టెంట్ టీచర్ శైలేంద్ర సింగ్ గౌతమ్ వీడియో 2015లో ఈ పాఠశాల ప్రైమరీ వింగ్‌లో నియమితులయ్యారు. ఈ ఘటన సెప్టెంబర్ 30 శుక్రవారం జరిగింది.

గత కొన్ని రోజుల క్రితమే పంజాబ్‌లో ఇలాంటి సంఘటన ఒకటి చోటుచేసుకుంది. పంజాబ్‌లోని జీఎన్‌డీయూ కాలేజ్‌లో మ్యాథ్స్ టీచర్ క్లాస్‌ రూమ్‌లో మద్యం బాటిల్‌ కనిపించాడు. తాగుతూ డ్యాన్స్ చేశాడు. తన సొంత డబ్బుతో మద్యం తాగుతున్నానని, తనను అడిగే హక్కు ఎవరికీ లేదన్నాడు. ఆయన తరగతి గదిలో పాట పాడుతూ డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అవ్వడంతో.. ఆయన బాగోతం బయటపడింది. అయితే ఆ టీచర్ తర్వాత మాట మార్చాడు. తను తాగలేదని, నటించానని చెప్పుకొచ్చాడు. కాలేజ్ మేనేజ్‌మెంట్ మాత్రం... ఆయనపై చర్యలు తీసుకుంది. ఈ మేరకు టీచర్లను హెచ్చరిస్తూ ఒక సర్యులర్‌ను కూడా జారీ చేసింది.



Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: