మూడు రాజధానుల వికేంద్రీకరణకు మద్దతుగా,,,
కర్నూలు నగరంలో ప్రత్యేక పూజలు
(జానో జాగో వెబ్ న్యూస్-ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రతినిధి)
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న సంకల్పానికి దేవుడి ఆశీర్వాదం కూడా తొడవ్వాలని విజయదశమి సందర్భంగా కర్నూలు నగరంలోని కేసీ కెనాల్ వద్ద ఉన్న వినాయకుని దేవాలయం, శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ప్రతిపక్ష పార్టీల తీరు మారాలని,వికేంద్రీకరణకు వారు అడ్డుపడకుండా దేవుడు వారికి మంచి మనసు ప్రసాదించాలని పూజలు నిర్వహించారు అనంతరం టెంకాయలు కొట్టిన నాయకులు, పాణ్యం ఎమ్యెల్యే, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు, నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి,కోడుమూరు ఎమ్యెల్యే సుధాకర్ బాబు, కర్నూలు నగర మేయర్ బీవై.రామయ్య,నంద్యాల, కర్నూలు పార్లమెంట్ సభ్యులు పొచా బ్రహ్మానంద రెడ్డి,సంజీవ్ కుమార్
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి అమరావతి లోని 29 గ్రామాలు కాకుండా, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో జరగాలని, వికేంద్రీకరణతో (మూడు రాజధానులతో) రాష్ర్టం అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తు
లో ఆంధ్రప్రదేశ్ మరోసారి ముక్కలయ్యేందుకు అవకాశం లేకుండా అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం వికేంద్రీకరణ భావనను మరింత బలంగా ప్రజలలోకి తీసుకుపోవాలనే ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరంలోని పలువురు కార్పొరేటర్లు, కార్పొరేషన్ ల చైర్మన్ లు,డైరెక్టర్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Home
Unlabelled
మూడు రాజధానుల వికేంద్రీకరణకు మద్దతుగా,,, కర్నూలు నగరంలో ప్రత్యేక పూజలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: