అనుమతులు లేకుండా టపాసులు విక్రయిస్తే కఠిన చర్యలు 

గడివేముల ఎస్సై బి.టి. వెంకటసుబ్బయ్య హెచ్చరిక


(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

అనుమతులు లేకుండా టపాసులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గడివేముల ఎస్సై బి.టి. వెంకటసుబ్బయ్య హెచ్చరించారు. అనుమతులు లేని వారు టపాసులు విక్రయించకూడదని ఆయన సూచించారు. టపాసులు అమ్మేందుకు లైసెన్సులు కలిగిన వారు బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే వాటిని విక్రయించాలని ఆయన సూచించారు. అనుమతులు లేకుండా ఎవరైనా టపాసులు విక్రయించినట్లు తమ దృష్టికి వస్తే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చించరించారు. ఈ విషయంలో ఎవరిని ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: