సమాధిలోకి వెళ్లివచ్చిన బాబా...హారతులు పట్టిన జనం


సమాజంలో బాబాల ప్రభావం ఏ మేర ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కాలం ఎంత మారుతున్న వారి క్రేజ్ మాత్రం తగ్గడంలేదు.  ఇదిలావుంటే  మధ్యప్రదేశ్‌లోని భోపాల్లో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఓ స్వామిజీ సమాధిలోకి వెళ్లారు. 72 గంటలపాటు అందులో అన్నారు. తర్వాత సజీవంగా బయటకొచ్చింది. ఇది అక్కడ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మా భ‌ద్ర‌కాళి విజ‌య‌స‌న్ ద‌ర్బార్ వ్య‌వ‌స్ధాప‌కుడు బాబా పురుషోత్త‌మానంద్ మహరాజ్ సమాధిలోకి వెళ్లారు. అనంతరం 72 గంటల తర్వాత బయటకొచ్చారు.


బయటకొచ్చిన బాబాను చూసేందుకు భక్తులు పోటెత్తారు. స‌మాధి దగ్గర ఆయ‌న‌కు హార‌తి ఇచ్చారు. స‌మాజ సంక్షేమం కోసం తాను స‌మాధిలోకి వెళ్లాన‌ని పురుషోత్త‌మానంద్ అన్నారు. అంతేకాదు తాను దుర్గా మాత‌ను ద‌ర్శించాన‌ని చెప్పుకొచ్చారు. ఇన్ని గంటల పాటు సమాధిలో ఉన్నా తాను బలహీనడపలేదన్నారు. స‌మాధిలో త‌న శ‌రీరం మాత్ర‌మే నేల‌పై ఉంద‌ని, త‌న ఆత్మ భ‌గ‌వంతుడిపై ల‌గ్నమైంద‌ని ఆయ‌న అన్నారు. ఈ సందర్భంగా మ‌రోసారి తాను 84 గంట‌ల పాటు స‌మాధిలో ఉంటాన‌ని బాబా పురుషోత్త‌మానంద్ వెల్ల‌డించారు.


అలాగే బాబా సమాధిలోకి వెళ్లే ముందు పది రోజులు పాటు ఎటువంటి ఆహారం తీసుకోలేదని, కేవలం ద్రవాహారం మాత్రమే తీసుకున్నారని అతని కొడుకు మిత్రేష్ కుమార్ తెలిపారు. పురు‌షోత్త‌మానంద్ బాబా సమాధి కోసం ఆయన ఇంటి దగ్గర ఏడున్నర అడుగుల లోతున, నాలుగు అడుగుల వెడల్పు, ఆరు అడుగుల పొడవైన గొయ్యి తవ్వారు. అందులోనే ఆయన 72 గంటలపాటు ఉన్నారు. నిజానికి బాబా పురుషోత్త‌మానంద్ మ‌హ‌రాజ్ స‌మాధిలోకి వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. వారు అస్సలు అంగీకరించలేదే. కానీ తాను అనుకున్న ప్ర‌కారం స‌మాధిలోకి వెళ్లి వచ్చారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: