ఆ ఎద్దులను మేపలేక సతమతమవుతున్న బీహార్ పోలీసులు
ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చిందన్నట్లుగా బీహార్ పోలీసుల పరిస్థితి నెలకొంది. అక్రమ మద్యం తరలించే వ్యక్తని పట్టుకొన్న పాపానికి ఎద్దులను మేపలేక పోలీసులు సతమతమవుతున్నారు. అరెస్టు ఏమిటీ ఎద్దులను మేపడం ఏమిటీ అన్న సందేహం ఎవరికైనా రావచ్చు. ఇదిలావుంటే బీహార్‌లో మద్యపాన నిషేద చట్టం అమల్లో ఉందని అందరికి తెలిసిందే. అదే పోలీసులకు వింత కష్టాలను తెచ్చిపెట్టింది. ఓ గ్రామస్థుడు ఈ చట్టాన్ని ఉల్లంఘించి.. ఎద్దుల బండిలో అక్రమ మద్యం రవాణా చేస్తూ పోలీసులకు చిక్కాడు. ఆ వ్యక్తితో పాటు, మద్యాన్ని, ఎద్దులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా... అక్కడ నుంచి పోలీసులకు వింత కష్టాలు మొదలయ్యాయి. ఆ ఎద్దులను మేపడం పెద్ద సవాల్ అయింది.
అక్రమ మద్యం రవాణా జరుగుతుందనే సమాచారంతో.. జనవరి 25న బీహార్‌లోని జాదోపూర్ పోలీస్ స్టేషన్ పోలీసులు.. రాంపూర్ టెంగ్రాహి గ్రామ సమీపంలో తనిఖీలు నిర్వహించారు. అప్పుడు ఓ ఎద్దుల బండిలో అక్రమంగా మద్యం రవాణా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. వెంటనే బండిలో పశువుల మేతతో పాటు అక్రమంగా తీసుకెళ్తున్న 960 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎద్దుల బండిని సీజ్ చేశారు. ఎద్దులను స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ మద్యం కేసులో నిందితులు ఓంప్రకాష్ యాదవ్ సహా మరో ముగ్గురిని పోలీసులు జైలుకు తరలించారు.
అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్న ఎద్దులతో... పోలీసులకు తిప్పలు వచ్చిపడ్డాయి. నిబంధనల ప్రకారం వాటిని వేలం వేయాలి. అయితే కొనుగోలు చేయడానికి ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. దాంతో ఆ ఎద్దులను పోషించడం... పోలీసులకు చాలా కష్టమైంది. వాటిని చూసుకోలేక చేతులెత్తేశారు. దాంతో నిందితుల్లో ఒక్కరైన ఓం ప్రకాష్ యాదవ్‌కే తిరిగి ఆ ఎద్దులను అప్పగించారు. వాటిపై ఆయనకు ఎటువంటి హక్కు ఉండదు. కేవలం వాటి నిర్వహణ బాధ్యతను మాత్రమే చూసుకోవాల్సి ఉంటుంది. వాటిని అప్పగించి తొమ్మిది నెలలు అయింది.. ఓం ప్రకాష్ భార్య ఎద్దులను చూసుకుంటుంది.
మరోవైపు ఆ ఎద్దులను నిందితుడుకి అప్పగించడం ఏమిటని పోలీసులపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై జాదోపూర్ ఎస్‌హెచ్‌వో విక్రమ్ కుమార్ స్పందించారు. ఎద్దులను సంరక్షించేందుకు ఓంప్రకాష్‌కు పోలీస్ స్టేషన్ ద్వార ప్రతినెలా రూ.10 వేలు ఇస్తున్నామని, ఎద్దులను వేలం వేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని విక్రమ్ కుమార్ చెప్పారు.
కానీ దీనిపై ఓం ప్రకాష్ యాదవ్ వాదన మరోలా ఉంది. ఆరు నెలల శిక్ష అనుభవించి బయటకు వచ్చిన యాదవ్.. ఎద్దుల కోసం తొమ్మిది నెలలుగా రూ.50,000 కంటే ఎక్కువ ఖర్చు అయిందని, పోలీసులు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాదు వాటిని అమ్మడం కూడా పెద్ద సమస్యగా మారిందని యాదవ్ చెప్పాడు. వాటిని వేలం కోసం జిల్లా మేజిస్ట్రేట్ రూ. 60,000 నిర్ణయించారని, తాను వాటిని రూ. 38,000కి మాత్రమే కొనుగోలు చేశానని అని యాదవ్ చెప్పారు. ఏ ఒక్కరూ వాటిని ఎక్కువ ధరకు కొనుగోలు చేయాలని చూడరని యాదవ్ చెప్పాడు. అలాగే ప్రస్తుతం ఆ ఎద్దులతో ఏ పని చేయించలేమని, వాటికి ఏమైనా అయితే తనపై క్రూరత్వం కింద కేసు నమోదు చేస్తారని వాపోయాడు. దీంతో ఆ ఎద్దుల సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక.. పోలీసులు సతమతం అవుతున్నారు.
Home
Unlabelled
ఆ ఎద్దులను మేపలేక సతమతమవుతున్న బీహార్ పోలీసులు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: