పాణ్యం మండలం లోని ఏపీ మోడల్ స్కూల్ .. కేజీబీవీ స్కూల్ కు..రహదారి వేయాలి
పాణ్యం ఎమ్మెల్యే కు వినతి పత్రం అందించిన ఆర్విఎఫ్.. ఏఐఎఫ్బి నేతలు
(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)
పాణ్యం మండలం లోని ఏపీ మోడల్ స్కూల్ .. కేజీబీవీ స్కూల్ కు..రహదారి వేయాలని కోరుతూ పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి ఆర్ విఎఫ్, ఏఐఎఫ్ బి నేతలు బత్తిని ప్రతాప్, శ్రీనివాసరావు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నంద్యాల జిల్లా పాణ్యం మండల కేంద్రంలోని Ap మోడల్ స్కూల్, కళాశాల, కేజీబీవీ స్కూల్, కళాశాల లకు రహదారి లేదనీ పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి వినతిపత్రాన్ని అందజేశామని వారు తెలిపారు. రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు బత్తిని ప్రతాప్, శ్రీనివాస రావు మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాల నుండి స్కూల్ కు రహదారి లేక విద్యార్థులు ప్రతిరోజు విద్యార్థులు గ్రామస్తుల తో గొడవలు పడుతున్నారని, స్కూల్ లో దాదాపుగా 3000 మంది విద్యార్థులు ఉన్నారని,
ఆ రహదారి గ్రామస్తులు మధ్యలో ఉన్నది మీ స్కూల్ కు దారి లేదు కావున ఇటు వైపు రావద్దు అని ప్రతిరోజు గ్రామస్తులతో వాదనలు జరుగుతున్నాయని, వెంటనే రహదారి ఏర్పాటు చేయాలని పాణ్యం ఎమ్మెల్యేకి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని, స్కూల్ కు వంటగది లేక బయట వంటలు చేసే పరిస్థితి వస్తున్నదని, కళాశాలలో సైన్స్ ల్యాబ్ లో సరైన పరికరాలు ఏర్పాటు చేయాలని కోరుతూ,సాయంకాలం సమయంలో అక్కడబాలికల హాస్టల్ ఉన్నది దానికి ఎటువంటి భద్రత లేదని, విద్యార్థులకి కాంపౌండ్ వాల్ లేనందువలన ఎవరు పడితే వారు రావడం వెళ్ళడం జరుగుతూ ఉండటం వలన విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారని, కావున అక్కడికి ప్రతి రోజు ఒక కానిస్టేబుల్ ని సాయంత్రం, రాత్రి సమయాలలో వెళ్లవలసిందిగా కోరుతూ స్కూల్ కు వెంటనే రోడ్డు, కాంపౌండ్ వాల్ నిర్మించాలని విద్యార్థి, ప్రజా సంఘాలు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి నీ కోరారు.
Home
Unlabelled
పాణ్యం మండలం లోని ఏపీ మోడల్ స్కూల్ .. కేజీబీవీ స్కూల్ కు..రహదారి వేయాలి... పాణ్యం ఎమ్మెల్యే కు వినతి పత్రం అందించిన ఆర్విఎఫ్.. ఏఐఎఫ్బి నేతలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: