ఆ ఇద్దరు నా అభిమాన నేతలు

లాల్ బహదూర్ శాస్త్రి, అటల్ బిహారీ వాజ్ పేయి తనకు ఇష్టమైన నాయకులు అని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. అగ్ర హీరోగా టాలీవుడ్ ను ఏలుతున్న సమయంలోనే రాజకీయాల్లోకి వచ్చిన మెగా స్టార్ చిరంజీవి ఆ రంగంలో ఎక్కువ కాలం ఇమడలేకపోయారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రి పదవిని చేపట్టారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరమై మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’ ఇటీవల విడుదలై మంచి విజయం అందుకుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. చిరంజీవిని ఇంటర్వ్యూ చేశారు. ఇందులో చిరుని పూరి ఆసక్తికర ప్రశ్నలు అడిగారు. 

ఈ సినిమా పొలిటికల్ డ్రామా కావడంతో... మీకు ఇష్టమైన రాజకీయ నాయకులు ఎవరు? అని పూరి జగన్నాథ్ అడిగారు. ప్రశ్నకు చిరంజీవి ఇబ్బంది పడకుండా ఏ జనరేషన్ నాయకులైనా సరే అని అన్నారు. దీనికి సమాధానం ఇచ్చిన చిరు.. ఈ జనరేషన్ లో ఇష్టమైన నాయకులు ఎవరంటే తన దగ్గర సమాధానం లేదన్నారు. పాత కాలంలో చాలా మంది గొప్ప నాయకులు ఉన్నారని, పార్టీలకు అతీతంగా వాళ్లంటే తనకు ఇష్టమని చెప్పారు. లాల్ బహదూర్ శాస్త్రి, అటల్ బిహారీ వాజ్ పేయి తనకు ఇష్టమైన నాయకులు అని చెప్పారు. మహాత్మా గాంధీ పుట్టిన రోజునే జన్మించిన శాస్త్రి ఆయనలానే ఉంటారన్నారు. వాజ్ పేయి నిజమైన రాజనీతిజ్ఞుడు అని కొనియాడారు. ఈ ఇద్దరి నాయకత్వంలో మన దేశం చాలా పురోగతిని సాధించిందన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: