పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా..
రెడ్ క్రాస్.. నంద్యాల సబ్ డివిజన్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో రక్త దాన కార్యక్రమం
(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)
రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్త దానం చేసిన రక్త దాతలకు గవర్నర్ గారి అభినందన తో కూడిన సర్టిఫికెట్ లు అందచేస్తామని తెలియచేసిన రెడ్ క్రాస్ నాయకులు పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న ఉదయం ఎనిమిది గంటల నుండి ఎస్పి గారి కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న స్వచ్ఛంద రక్తదాన కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేయవలసిందిగా పోలీస్ సిబ్బందికి, నంద్యాల యువతకు పిలుపునిచ్చిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీస్థానిక సెవెన్ హిల్స్ హాస్పిటల్ లో రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ మారుతి కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రెడ్ క్రాస్ ప్రతినిధులు మాట్లాడుతూ..
పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎస్పి గారి కార్యాలయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా బ్రాంచ్ మరియు నంద్యాల సబ్ డివిజన్ పోలీస్ శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న స్వచ్ఛంద రక్తదాన కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేయవలసిందిగా పోలీస్ సిబ్బందికి, నంద్యాల యువతకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు పిలుపునిచ్చారు.ఈ స్వచ్ఛంద రక్త దాన కార్యక్రమాన్ని గౌరవ నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ప్రారంభిస్తారని, నంద్యాల డి.ఎస్.పి మహేశ్వర రెడ్డి పర్యవేక్షిస్తారని ,కర్నూలు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డా.కుమార స్వామి రెడ్డి సిబ్బంది, నంద్యాల ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డా.శ్రీమతి. శేషారత్నం , వారి సిబ్బంది పాల్గొని సేవాలందిస్తారని మారుతి తెలిపారు.
ఈ విలేకరుల సమావేశంలో రెడ్ క్రాస్ చైర్మన్ పర్ల దస్తగిరి , ట్రెజరర్ నాగేశ్వరరావు, ఈసీ సభ్యులు ఉస్మాన్ , రెడ్ క్రాస్ సీనియర్ సభ్యులు నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సిబ్బంది మాట్లాడుతూ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్త దానం చేసిన స్వచ్ఛంద రక్త దాతలకు గవర్నర్ సంతకం ఉన్న ప్రశంస పత్రం అందజేయడం జరుగుతుందన్నారు, పోలీస్ వారి గురించి మాట్లాడుతూ అగ్ని కీలల్లో చిక్కుకున్న వారికి ఆక్సిజన్ అయ్యారుతుఫాను లో చిక్కుకున్న వారిని తీరానికి చేర్చారు . ప్రమాదంలో ఉన్నవారికి ప్రాణాలు అడ్డువేశారు. చివరకు దేశం ముందు దేహం ఎంత అన్నారు. పోలీసు యోధులారా వెలకట్టలేని మీ త్యాగానికి ఇదే మా హృదయాంజలి కావున విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ అమరవీరులకు స్వచ్ఛంద రక్తదానం చేసి నివాళులర్పిద్దాం అని రెడ్ క్రాస్ సభ్యులు రక్త దాతలకు పిలుపునిచ్చారు
Home
Unlabelled
పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా.. రెడ్ క్రాస్.. నంద్యాల సబ్ డివిజన్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో రక్త దాన కార్యక్రమం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: