పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా 

రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరం విజయవంతం

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా బ్రాంచ్ మరియు నంద్యాల పోలీస్ సబ్ డివిజన్ సంయుక్తంగా  ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. శిబిరాన్ని నంద్యాల జిల్లా ఎస్ పి. రఘువీర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించగా అడిషనల్ ఎస్పీ రమణ, డిఎస్పి  మహేశ్వర్ రెడ్డి, రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి పర్ల తదితరులు పాల్గొన్నారు.

ఈ శిబిరంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కుమారస్వామి రెడ్డి, నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శేషారత్నం తదితరులు వైద్య సేవలందించగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ మారుతి కుమార్,

ట్రెజరర్ నాగేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు ఉస్మాన్ భాష ,యాకుబ్, సీనియర్ రెడ్ క్రాస్ సభ్యులు నాగేశ్వర్ రెడ్డి , నాగరాజు, పోలీసు నంద్యాల సబ్ డివిజన్ సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది, పట్టణ కౌన్సిలర్లు , స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 200 మందికిపైగా స్వచ్ఛంద రక్తదానం చేశారు. ఈ శిబిరం ఏర్పాటు చేసినందుకు రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ఎస్పీ రఘువీరా రెడ్డి  గారిని పోలీస్ సిబ్బందిని సన్మానించడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి మాట్లాడుతూ  బ్లడ్ డొనేషన్ క్యాంపులో స్వచ్ఛందంగా పోలీస్ శాఖ, మీడియా మిత్రులు, విద్యార్థులు, గ్రామ,వార్డు మహిళా పోలీసులు, ప్రజలు ,ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో పాల్గొని బ్లడ్ డొనేషన్ చేయడం చాలా సంతోషించవల్సిన విషయం అని ఎందుకనగా అన్ని దానాలలో రక్తదానం అనేది కూడా చాలా ముఖ్యమైనదిగా భావిస్తున్నానాని రక్తం దేహమునకు ప్రాణం ఇటువంటి రక్త దానం చేయడం వల్ల ఎందరో ఆపదలో ఉన్నవారికి ఉపయోగపడుతుందని, ఆపదలో ఉన్న వారి ప్రాణాల్ని కాపాడుతుందని, మీడియా మిత్రులు కూడా రక్తదానం చేయడంలో ముందుకు వచ్చి పాల్గొనందుకు చాలా సంతోషకరంగా ఉందని అభినందించారు.

ఈ సందర్భంగా బ్లడ్ డొనేట్ చేసిన 200 మందికి  రెడ్ క్రాస్ సొసైటీ వారి తరఫున ప్రశంసాపత్రాలు అందించారు. ఈ సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంపునకు నంద్యాల పట్టణంలోని పోలీస్ సిబ్బంది తోపాటు ,మీడియా మిత్రులు, విద్యార్థులు ,గ్రామ ,వార్డు మహిళా పోలీసులు, ప్రైవేటు సెక్యూరిటీ సంస్థ మరియు ఆర్మీ సిబ్బంది పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: