హిందీలో ఎంబీబీఎస్ కు ఆ రెండు రాష్ట్రాలు ఒకే


హిందీ భాషా వాడకంపై నిరసన వ్యక్తమవుతన్న తరుణంలో ఎంబీబీఎస్‌ విద్యను హిందీలోనూ అందించేందుకు రెండు రాష్ట్రాలు ముందుకొచ్చాయి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని గాంధీ మెడికల్ కళాశాల, చత్తీస్‌గఢ్‌ బిలాస్‌పూర్‌లోని అటల్ బిహారీ వాజ్‌పేయి విశ్వవిద్యాలయం ఈ విధానాన్ని దేశంలోనే తొలిసారి అందుబాటులోకి తీసుకురానున్నాయి. ఈ మేరకు ఎంబీబీఎస్ మొదటి సంవత్సరానికి సంబంధించిన పాఠ్యపుస్తకాలను ఇప్పటికే హిందీలో ముద్రించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 16న భోపాల్‌లో జరిగే ఓ కార్యక్రమంలో వీటిని ఆవిష్కరిస్తారు.

ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఈ రెండు కళాశాలల్లో 15 శాతం సీట్లను జాతీయ కోటా కింద కేటాయించాలి. అయితే, హిందీయేతర రాష్ట్రాలకు మాత్రం సీట్లు వస్తే ఇబ్బంది తప్పదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా, గతేడాది బీటెక్‌ను ఆయా ప్రాంతీయ భాషల్లో ప్రారంభించారు. ఆంధప్రదేశ్‌లోని ఒక కళాశాలతోపాటు మొత్తం 14 కాలేజీలు ప్రాంతీయ భాషల్లో ఇంజినీరింగ్‌ను బోధించేందుకు ముందుకొచ్చాయి. ఈసారి ఆ కాలేజీల సంఖ్య 20కి పెరిగింది.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: