గుర్రంపై వచ్చి మునుగోడులో నామినేషన్ వేశాడు


ప్రజలను ఆకర్షించడానికి కోటి కష్టాలు  పడాలి మరి. కానీ ఓ అభ్యర్థి వింతగా నామినేషన్ వేసేందుకు వచ్చాడు. ఏకంగా గుర్రమెక్కి నామినేషన్ వేసేందుకు వచ్చాడు.  సాధారణంగా ఎన్నికలు అంటేనే అట్టహాసాలు, ఆడంబరాలు కనిపిస్తుంటాయి. అందులో నామినేషన్ అంటే కనిపించే హడావుడి అంతా ఇంతా కాదు. కొన్నిచోట్ల అయితే వేల మందితో ర్యాలీలు తీస్తూ నామినేషన్లు వేస్తుంటారు. అయితే ప్రస్తుతం తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో మాత్రం ఒక అభ్యర్థి గుర్రంపై వచ్చి నామినేషన్ వేయడం అందరినీ ఆకర్షించింది.

మునుగోడులో గుర్రంపై వచ్చి నామినేషన్ వేసిన అభ్యర్థి ఒక వైద్యుడు. పేరు వీరభోగ వసంతరాయుడు. హైదరాబాద్ లో డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తున్న ఆయన స్వస్థలం.. మునుగోడు నియోజకవర్గంలోని కుమ్మరిగూడెం. అయితే ఎన్నికల్లో పోటీ చేయాలని భావించి మునుగోడుకు వచ్చారు. ఇలా వినూత్నంగా గుర్రంపై వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. అది చూసిన స్థానికులు భలేగా ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. కొందరు ఫొటోలు తీసి స్థానిక వాట్సాప్ గ్రూపులలో, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: