మహాత్మా జ్యోతిరావ్ పూలే సావిత్రిబాయిపూలే... 

విగ్రహాల ఆవిష్కరణ

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా ఓర్వకల్లు మండల కేంద్రంలో రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ (అర్వీఎఫ్) రవీంద్రనాథ్ అధ్వర్యంలో పులే దంపతుల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం లో మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి  మాట్లాడుతూ బహుజనులకు ఆరాధ్యదైవం జ్యోతిరావ్ పూలే సావిత్రిబాయి పూలే  అని ఆమె  అని కొనియాడారు. ఓర్వకల్ లో జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుల తల్లి, దేశ మొట్ట మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయిపూలే  మహాత్మా జ్యోతిభా పూలే విగ్రహదాత బి.సి.సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మహిళా ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి , ఓర్వకల్ ఎస్ఐ మల్లికార్జున, ఎంఆర్ఓ శివప్రసాద్ రెడ్డి , ఎంఈఓ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి .  అనీషా, కల్యాణి లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్నం రాజేశ్వరి,నక్కలమిట్ట శ్రీనివాసులు, రాయలసీమ రవీంద్ర నాథ్  లు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సావిత్రిబాయిపూలే జయంతి దినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని, సావిత్రిబాయిపూలే జయంతిని అధికారికంగా నిర్వహించాలని, ప్రతి పాఠశాలలో చదువుల తల్లి సావిత్రిబాయిపూలే విగ్రహాలు ఏర్పాటు చేయాలని వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. సావిత్రిబాయి పూలే బాలికల విద్య కోసమే కాకుండా మహిళల ఆత్మగౌరవం కోసం,హక్కుల కోసం  పాటు పడటమే కాక రైతుల హక్కుల కోసం కూడా పోరాటం చేసిన ధీరవనిత సావిత్రిబాయి పూలే అని  కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు విక్రమ్.బాలక్రిష్ణ నాయక్. మహిళా ఐక్య వేదిక కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి వి.సరస్వతి,శార, రాధ తదితరులు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: