రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన

రక్తదాన శిబిరం... విజయవంతం


(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

నంద్యాల జిల్లా లో స్థానిక మున్సిపల్ పార్క్ లోని ఆయుష్ యోగ సెంటర్ నందు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని చైర్మన్ దస్తగిరి ,యోగ మాస్టర్ ఆనంద్ గురూజీ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు 50 మంది విద్యార్థిని విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిరక్తదానం ఇచ్చి రక్తదానం చేయడం నంద్యాల జిల్లా ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో ప్రజలందరికీ అందుబాటులో ఉంటామని, ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తులను కాపాడడం అదృష్టమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా మున్సిపల్ కమిషనర్ రవిచంద్ర రెడ్డి, రామకృష్ణ డిగ్రీ కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి,ఆయుష్ యోగ సేవాసమితి వైస్ చైర్మన్ మారుతి కుమార్, కోశాధికారి నాగేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు, సీనియర్ సభ్యులు రాధాకృష్ణయ్య, రెడ్ క్రాస్ మండల అధ్యక్షుడు నాగేశ్వర్ రెడ్డి, డిఎఫ్ఓ రాజు నాయక్, బ్లడ్ బాంక్ వైద్యాధికారి డాక్టర్  రామచంద్రరావు, కర్నూలు డీఎఫ్ఓ రమేష్, లాబ్ టెక్నీషియన్ చాంద్ భాష, రెడ్ క్రాస్ సభ్యులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గారు మాట్లాడుతూ రెడ్ క్రాస్ ఏర్పడిన మూడు నెలల్లోనే ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులకు రక్తం ఇచ్చి కాపాడడం ఎంతో ఆనందంగా ఉందని, రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం చాలా గొప్ప విషయమని, భవిష్యత్తులో రెడ్ క్రాస్ కు తమ సహకారం ఉంటుందని తెలిపారు

డాక్టర్ రామకృష్ణారెడ్డి, మాట్లాడుతూ చాలా తక్కువ సమయంలో రెడ్ క్రాస్ నంద్యాల జిల్లా ప్రజలకు చేరువైందన్నారు,  ఆయుష్ యోగ సభ్యులు, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు,మాస్టర్ స్కూల్ ఉపాధ్యాయులు, ఒకటవ వార్డు కౌన్సిలర్ నాగార్జున ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో యువతీ యువకులు, మహిళలు రక్త దానం చేశారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: