తోటి విద్యార్థికి మానవత్మం చాటిన చిన్నారి హృదయాలు
స్పందించిన ఉపాధ్యాయులు.... విద్యార్థి పూజితకు ఆర్థిక సాయం అందజేత
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా గడివేముల మండలపరది లోని గడిగరేవుల గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పదవ తరగతి చదువుతున్న చిందుకూరు గ్రామానికి చెందిన విద్యార్థిని పూజిత తల్లిదండ్రులు ఇద్దరు ఓకె సంవత్సర లో మృతి చెందడంతో పూజిత తల్లిదండ్రులను కోల్పోయిన భాధతో, ఆర్థిక ఇబ్బందులతో పాఠశాలకు సక్రమంగా హాజరు కాకపోవడంతో విద్యార్థి పూజిత ను చూసిన తోటి విద్యార్థులు చలించి తోటి విద్యార్థులు పూజిత కు ఆర్థిక సహాయం చేయాలని తలంచి కొంత నగదు జమ చేసుకుని నిత్యావసర సరుకులు తీసుకుని పూజిత అందించాలని ఉపాధ్యాయులను కోరగా విషయం తెలుసుకున్న ప్రధానోపాధ్యాయురాలు విమల వసుంధర దేవి మరియు ఉపాధ్యాయులు, విద్యార్థుల గొప్ప మనసుకు స్పందించి వారిని అభినందించటంతో పాటు పూజిత పరిస్థితి ఆరా తీయగా ఆర్థిక పరిస్థితి సరిగా లేదని పూజితకు ఒక చెల్లెలు, ఒక తమ్ముడు వేర్వేరు పాఠశాలల్లో చదువుతున్నారని వీరందరికీ ఆధారం నాన్నమ్మ మాత్రమే ఆని తెలుసుకొని విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు 20 వేల రూపాయలు విరాళాలు సేకరించి మూడు నెలలకు కావలసిన నిత్యావసర సరుకులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి నిర్మల వసుంధర దేవి ఆధ్వర్యంలో చిందుకూరుకు వెళ్లి పూజిత కు ధైర్యం నింపటమే కాక భవిష్యత్తులో మీకు చదువు పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉపాధ్యాయలు మీకు అండగా ఉంటారని భరోసా ఇచ్చి 28,000రూపాయులు, నిత్యఅవసర సరుకులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయనీ, ఉపాధ్యాయలు మాట్లాడుతూ విద్యార్థులను మీ చేతులు చిన్నవే అయినా హృదయం మాత్రం విశాలమైనదని, భవిష్యత్తులో మీరు "సమాజానికే ఆదర్శంగా" నిలుస్తారని, విద్యార్థినీ, విద్యార్థులు నరేంద్ర, వినయ్, చిన్నారి, సుగుణ, అనూష, సుప్రియ లను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయనీ,ఉపాద్యాయలు పద్మజ, చంద్రావతి, కోమలమ్మ, పుష్పకుమారి, కవిత, కేశమ్మ, నాగలక్ష్మి, లక్ష్మీదేవి, లలిత, అదిషేశమ్మ, సుబ్బారెడ్డి, మారెన్న, దేవనాల శ్రీనివాసులు, బాలస్వామి, మాజీ విద్యా కమిటీ చైర్మన్ గోవింద రాజులు మరియు ఔట్ సోర్సింగ్ సిబ్బంది మహబూబ్, హరిత తదితరులు పాల్గొన్నారు.
Home
Unlabelled
తోటి విద్యార్థికి మానవత్మం చాటిన చిన్నారి హృదయాలు,,, స్పందించిన ఉపాధ్యాయులు.... విద్యార్థి పూజితకు ఆర్థిక సాయం అందజేత
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: