మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో బుక్క వేణుగోపాల్

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లకు వినతి

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకొంటోంది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా ఆ పార్టీకి చెందిన జాతీయ, రాష్ట్ర నేతలు మునుగోడులో పర్యటిస్తున్నారు. తాజాగా బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ కూడా మునుగోడు ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. హైదరాబాద్ నుంచి తన కార్యకర్తలతో మునుగోడుకు వచ్చిన బుక్క వేణుగోపాల్  బీజేపీకి ఓటేయాలని స్థానిక ప్రజలను అభ్యర్థించారు.


మునుగోడుకు  చేరుకొన్న బుక్క వేణుగోపాల్ ఆ నియోజకవర్గంలోని స్థానిక నేతలు, బూత్ స్థాయి నేతలతో భేటీ అయ్యారు.  కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను  సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని స్థానిక బీజేపీ నేతలను ఆయన కోరారు. ప్రత్యర్థులకు ఏ మాత్రం అవకాశమివ్వకూడదని, ఆయన సూచించారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు, తెలంగాణకు చేసిన మేలు వివరిస్తే మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సునాయాసం అని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: