శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం..... మూసివేత
(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా, పాణ్యం మండలంలోని ఎస్. కొత్తూరు గ్రామంలో సూర్యగ్రహణం ఉండడం చేత ఈరోజు తెల్లవారుజామున స్వామివారికి విశేషమైన పంచామృతా మరియు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించిన తరువాత బస్మాభి అలంకరణ చేసి తదుపరి మహా మంగళ హారతి ఇచ్చి స్వామివారి ఆలయం మూసి వేయబడినది. 26-10-22 (రేపు) ఉదయం స్వామి వారి ఆలయ సంప్రోక్షణ అదేవిధంగా స్వామి వారిని అభిషేకించిన తరువాత స్వామి వారి ఆలయ తలుపులు తెరువబడుతాయి కావున భక్తులందరూ గమనించగలరని దేవస్థానం అధికారులు తెలిపారు.
Home
Unlabelled
శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం..... మూసివేత
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: