రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టికెట్ హామీతో...

టిఆర్ఎస్ గూటికి శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్

(జానో జాగో వెబ్ న్యూస్ -పొలిటికల్ బ్యూరో)

దేశవ్యాప్తంగా మునుగోడు ఉప ఎన్నికలు అందరి దృష్టి ఆకర్షిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోనూ వేగంగా రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి మార్పులు చేర్పులు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ టిఆర్ఎస్ గూటికి చేరుకున్నట్టు సమాచారం. రాజేంద్రనగర్ అసెంబ్లీ టికెట్టు ఇస్తానన్న కెసిఆర్ పక్క హామీతోనే స్వామి గౌడ్ టిఆర్ఎస్ లో చేరినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. దీంతో వచ్చే ఎన్నికల్లో రాజేంద్రనగర్ టికెట్ ప్రకాష్ గౌడ్ కు కష్టమేనని స్పష్టంగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే మునుగోడు ఉప ఎన్నికలపై దృష్టి సారించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు అనంతరం రాబోయే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పైన కూడా ప్రధానంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలు ఎవరు అన్న దిశగా ఆయన ప్రతి నియోజకవర్గంలో సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపితో ఢీ అంటే ఢీ అనీ పోటీపడుతున్న టిఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన నియోజకవర్గాల్లో గట్టి గెలుపు గుర్రాలను ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం పై తన దృష్టి సారించిన కేసీఆర్ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ప్రకాష్ గౌడ్ ను చెక్ పెట్టి ఆస్థానంలో తెలంగాణ శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ ను ఎన్నికల బరిలో దించాలని భావిస్తున్నట్లు సమాచారం. టిఆర్ఎస్ పార్టీకి రాజకీయ మిత్ర పార్టీ ఎంఐఎం సైతం ప్రస్తుతం రాజేంద్రనగర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ప్రకాష్ గౌడ్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రకాష్ గౌడ్ కు చెక్ పెట్టి ఆస్థానంలో స్వామి గౌడ్ ను తీసుకురావాలన్న ప్రధాన ఉద్దేశంతో కెసిఆర్ పావులు కదిపినట్టు సమాచారం. 


రాజేంద్రనగర్ అసెంబ్లీ టికెట్టు ఇస్తానన్న పక్క హామీతో పాటు ఇతరత్రా భారీ ప్యాకేజీ నేపథ్యంలో స్వామి గౌడ్ టిఆర్ఎస్ లో చేరినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో తనదైన శైలిలో చక్రం తిప్పిన స్వామి గౌడ్ ఈసారి రాజేంద్రనగర్ టికెట్ ఆశించడం వెనక రాజకీయ వర్గాలు మరో చర్చ సాగుతోంది. ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు చెక్ పెట్టేందుకు స్వామి గౌడ్ వంటి నేత రాజేందర్ నగర్ కు రావడం తీవ్ర చర్చనీయంగా మారింది. స్వామి గౌడ్ ను కేవలం ప్రకాష్ గౌడ్ ను చెక్ పెట్టేందుకే టిఆర్ఎస్ లోకి తీసుకుందన్న వాదన కూడా వినిపిస్తోంది. ఈ పరిణామం స్వామి గౌడ్ వ్యక్తిగత ఇమేజ్ కు ఏ మాత్రం సరితూగదని కూడా చర్చ సాగుతోంది. ప్రకాష్ గౌడ్ చెక్ పట్టే ఉద్దేశంతో కాకుండా స్వామి గౌడ్ కు ఉన్న వ్యక్తిగత హోదా రిత్యా ఆయన్ని గౌరవించి టిఆర్ఎస్ నాయకత్వం పార్టీలోకి ఆహ్వానించి ఉంటే బాగుండేదని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. కేవలం ప్రకాష్ గౌడ్ ను చెక్ పెట్టేందుకే స్వామి గౌడ్ రాక ఆయన ప్రతిష్టకు ఏమాత్రం సరి కాదని కొత్త చర్చ సాగుతోంది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: