పెట్రోల్ బంక్ సిబ్బందికి భద్రత కల్పించాలి

గ్రేటర్ హైదరాబాద్ పెట్రోల్ ..డీజిల్ డీలర్స్ అసోసియేషన్ డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్ -హైదరాబాద్ ప్రతినిధి)

 పెట్రోల్ బంకు సిబ్బందిపై దాడులు పెరిగిపోతున్నాయని, దాడులు చేసే వారిని కఠినంగా శిక్షించి మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ పెట్రోల్, డీజిల్ డీలర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. దాడులకు దిగే కస్టమర్లపై పిట్టి కేసులు పెట్టి వదిలేస్తే మున్ముందు వారు మరింత రెచ్చిపోయే అవకాశం ఉందని వెల్లడించింది. గురువారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ పెట్రోల్, డీజిల్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మొహమ్మద్ ఖలీద్ షరీఫ్, ఎం. అమరేందర్ రెడ్డి, అసోసియేషన్ ప్రతినిధులు టిసి గోయల్ , గోపాల్ శర్మ, అన్వర్ పటేల్ తదితరులు మాట్లాడుతూ... పెట్రోల్ బంకులో పనిచేస్తున్న సిబ్బందికి.. డీలర్స్ కు భద్రత కల్పించాలని పోలీస్ అధికారులకు వారు కోరారు.


ఇటీవల పాతబస్తీలోని బహదూర్ పుర మిస్టర్ హైవే సర్వీస్ స్టేషన్ పెట్రోల్ పంపు నందు కొందరు వ్యక్తులు పెట్రోల్ పోయించుకుని యూపీఏ పేమెంట్ ద్వారా చెల్లింపు చేయగా అది విఫలమైనందున... డబ్బులు చెల్లించాలని కోరిన సిబ్బందిపై కస్టమర్స్ దాడి చేశారని వారు వెల్లడించారు. ఈ దాడిలో పెట్రోల్ పంప్ డీలర్ పృతు ఇతర సిబ్బంది పై వారు దాడి చేయగా గాయపడ్డారని వారు వెల్లడించారు. పెట్రోల్ వేయించుకున్న ఆ కస్టమర్లు బయట నుండి కొందరు వ్యక్తులను రప్పించుకొని వారు తుపాకీ, కత్తి, యాసిడ్తో దాడి చేసే ప్రయత్నం చేశారని వారు వెల్లడించారు. వీరిని కఠినంగా శిక్షించకుండా పిట్టి కేసు పెట్టి వదిలేస్తే భవిష్యత్తులో పెట్రోల్ బంకు సిబ్బందికి భద్రత ఉండదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. పెట్రోల్ బంకు డీలర్ పై దాడి చేసిన వీరిని కఠినాది కఠినంగా శిక్షించాలని మరోమారు ఎవరూ ఇలాంటి సాహసం చేయకుండా చూడాలని పోలీస్ అధికారులను వారు కోరారు. పెట్రోల్ బంక్ సిబ్బంది భద్రతా విషయంలో పోలీసులు చర్యలు తీసుకోకపోతే .. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు దోషులపై కఠినంగా వ్యవహరించకపోతే తాము కూడా కేవలం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే పెట్రోల్ సరఫరా చేసే నిర్ణయం తీసుకుంటామని వారు స్పష్టం చేశారు. ఏ సమయంలోనైనా మాకు భద్రత ఉంటుందన్న భావన కలిగినప్పుడే పెట్రోల్ బంకులను అన్నివేళలా తెరిచి ఉంచుతామన్నారు. లేనిపక్షంలో ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే పెట్రోల్ బంకులు తెరిచి ఉంచుతామని వారు స్పష్టం చేశారు. పెట్రోల్ బంకు సిబ్బంది, డీలర్ పై దాడి చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని బహదూర్పురా పోలీస్ స్టేషన్ నందు తమ సంఘం తరఫున ఫిర్యాదు కూడా చేశామని వారు తెలిపారు. పెట్రోల్ బంకు సిబ్బంది భద్రత విషయమై త్వరలో హైదరాబాద్ నగర కమిషనర్ తో పాటు రాష్ట్ర డిజిపిని కూడా కలిసి తమ డిమాండ్లు వివరిస్తామని వారు తెలియజేశారు. అదేవిధంగా పెట్రోల్ బంకులో పెట్రోల్ అవకతవకలు జరుగుతాయని అపోహలు కస్టమర్లలో నాటుకుపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి పెట్రోల్ బంకులు ఎలాంటి లోపాలు లేవని ఒకవేళ ఉన్న వాటిని కంపెనీ ఏర్పాటు చేసే మిషన్ ద్వారా పరిశీలించుకోవచ్చని కోరారు. ఇదే విషయమై కస్టమర్లకు పోలీసు ఉన్నతాధికారులు ఇతర అధికారులు అవగాహన కార్యక్రమం చేపడితే పెట్రోల్ బంకు వద్ద ఎలాంటి గొడవలకు ఆస్కారం ఉండదని వారు తెలిపారు. ఈ విషయంలో కూడా తమ వంతు సహకారం అందిస్తామని వారు వెల్లడించారు. యూపీఐ పేమెంట్ లో తలెత్తే సమస్యలతో పాటు.. పెట్రోల్ లో అవకతవకల అనే అపోహలపై చైతన్యవంత కార్యక్రమాలు ప్రభుత్వం తరఫున జరపాలని వారు కోరారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: