అత్యంత చీకటి అధ్యాయాల్లో సిక్కుల ఉచకోత ఒకటి 


నాటి చేదు అనుభవాలను  మన దేశస్థులే కాదు విదేశాల్లోనే ప్రముఖులు  సైతం గుర్తించుకొంటూవుంటారు. అలాంటి చేదు అనుభవమే నాటి సిక్కుల ఊచకోత అని చెప్పవచ్చు. 1984 సిక్కుల ఊచకోత ఆధునిక భారత చరిత్రలోని అత్యంత చీకటి అధ్యాయాల్లో ఒకటని అమెరికా సెనేటర్ ప్యాట్ టూమీ వ్యాఖ్యానించారు. సిక్కులపై జరిగిన అకృత్యాలను గుర్తుంచుకోవాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. తద్వారా ఈ ఘటనకు పాల్పడినవారిని జవాబుదారీ చేయవచ్చునని వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 1984 అక్టోబరు 31న తన సెక్యూరిటీ గార్డులో చేతిలో హత్యకు గురయ్యారు. ఈ ఉదంతంతో దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయి. దేశవ్యాప్తంగా వేలాది మంది సిక్కులను ఊచకోతకు గురయ్యారు. ఈ ఘటనలో 3 వేల మందికిపైగా సిక్కులు చనిపోగా.. ఢిల్లీలోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు.

పెన్సుల్వేనియా సెనేట్‌లో ప్యాట్ టూమీ మాట్లాడుతూ... ‘‘1984 నాటి సిక్కుల ఊచకోత ఆధునిక భారతదేశ చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయాల్లో ఒకటి.. భారతదేశంలోని జాతి సమూహాల మధ్య అనేక హింసాత్మక సంఘటనలు చెలరేగడం ముఖ్యంగా సిక్కు సమాజాన్ని లక్ష్యంగా చేసుకోవడాన్ని ప్రపంచం మొత్తం చూసింది’’ అని అన్నారు.

‘‘పంజాబ్ ప్రావిన్సులోని సిక్కులు, భారత కేంద్ర ప్రభుత్వానికి మధ్య దశాబ్దాల జాతి ఉద్రిక్తత తర్వాత నవంబర్ 1, 1984న ప్రారంభమైన విషాదాన్ని ఈ రోజు మనం ఇక్కడ గుర్తు చేసుకుంటున్నాం.. ఇటువంటి సందర్భాల్లో తరచుగా అధికారిక అంచనాలు మొత్తం కథను చెప్పలేవు.. అయితే 30,000 మందికి పైగా సిక్కు పురుషులు, మహిళలు, పిల్లలను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని, అత్యాచారం చేసి, వధించారు.. భారత్ వ్యాప్తంగా అల్లరి మూకలను తరలించినట్లు అంచనా ఉంది’’ ఆయన అని పేర్కొన్నారు.

‘‘భవిష్యత్తులో మానవ హక్కుల ఉల్లంఘనలను నివారించడానికి మనం వాటి గత రూపాలను గుర్తించాలి.. సిక్కులపై జరిగిన అఘాయిత్యాలను మనం గుర్తుంచుకోవాలి.. తద్వారా బాధ్యులను జవాబుదారీ చేయవలసి ఉంటుంది.. ప్రపంచవ్యాప్తంగా సిక్కు సమాజం లేదా ఇతర వర్గాలపై ఈ రకమైన దురాగతం పునరావృతం కాకుండా చూడాలి’’ అని టూమీ ఉద్ఘాటించారు.

దాదాపు 600 సంవత్సరాల చరిత్ర కలిగిన సిక్కు మతం భారత్‌లోని పంజాబ్ ప్రాంతంలో ఆవిర్భవించింది. అమెరికాలో 700,000 మంది సహా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 మిలియన్ల మంది అనుచరులతో ప్రపంచంలోని ప్రధాన మతాలలో ఒకటిగా ఉందన్నారు. చారిత్రాత్మకంగా అన్ని మత, సాంస్కృతిక, జాతి నేపథ్యాల నుంచి వచ్చిన వ్యక్తులకు సేవ చేయడంలో సిక్కులు నిబద్ధతను ప్రదర్శిస్తారు.

‘‘కోవిడ్-19 మహమ్మారి సమయంలో పెన్సుల్వేనియా సహా అమెరికా వ్యాప్తంగా జాతి, మత, వర్గ విబేధాలు చూపకుండా వేలాది కుటుంబాలకు నిత్యావసరాలు, మాస్కులు, ఇతర సామాగ్రిని అందజేశారు.. సిక్కుల స్ఫూర్తిని నేను వ్యక్తిగతంగా చూశాను..సమానత్వం, గౌరవం. శాంతిపై స్థాపించిన సిక్కు సంప్రదాయాన్ని బాగా అర్థం చేసుకున్నాను..సిక్కు సంఘాల ఉనికి, సహకారం దేశవ్యాప్తంగా వారి పొరుగు ప్రాంతాలను పూర్తిగా సుసంపన్నం చేశాయి’’ అని టూమీ ప్రశంసించారు.





Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: