నంద్యాల పట్టణ వీధుల్లో వర్షం నీటిలో....

చేపలు పడుతూ నిరసన వ్యక్తంచేసిన ఎస్ఎఫ్ఐ నంద్యాల పట్టణ నాయకులు

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల పట్టణంలో  రాత్రి కురిసిన కుండపోత వర్షానికి నంద్యాల పట్టణ వీధుల్లో  ప్రవహిస్తున్న నీటిలో  ఎస్ఎఫ్ఐ నంద్యాల పట్టణ నాయకులు చేపలు పడుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నంద్యాల పట్టణ నాయకులు ఓబులేష్,మదు కిరణ్ లు మాట్లాడుతూ ఈ రోజు కురిసిన భారీ వర్షానికి నంద్యాల పట్టణంలోని ప్రతి వీధిలో  నీరు గంగా యమునా నదులను తలపించే రీతిగా ప్రవహిస్తున్నాయి, అన్ని వీధుల్లో ఉన్న ఇళ్లల్లోకి నీరు ప్రవహించి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇళ్లలో ఉన్నటువంటి ఫర్నిచర్ దెబ్బతిన్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరు వీధుల్లోకి, ఇండ్లలోకి రావడానికి ముఖ్య కారణం మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే అని తెలిపారు. ముఖ్యంగా నంద్యాల పట్టణానికి నందనవనంగా తీర్చిదిద్దుతాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టణాన్ని మరింత అభివృద్ధి చేశామని చెప్పుతున్న అధికార పక్ష నాయకులు నంద్యాల అభివృద్ధి అంటే ఇదేనా, ఇంత అభివృద్ధి చెందుతున్నదని నంద్యాల పట్టణ ప్రజలు కలలో కూడా ఊహించి ఉండరు.


రాతిరి కురిసిన వర్షమే నంద్యాల అభివృద్ధిని తెలియజేస్తుందని, నంద్యాల జిల్లా పార్లమెంటు సభ్యులైన పోచ బ్రహ్మానందరెడ్డి ఇంటి ముందరే మోకాళ్ళ దాకా నీరు ప్రవహిస్తుందని, ముఖ్యంగా వీధి కాలువలలో పేరుకుపోయిన చెత్తను కూడికను తీయడంలో మున్సిపల్ అధికారులు ఘోరంగా విఫలమయ్యారని , వెంటనే వీధి కాలువలలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని పూడికను తొలగించాలని, చామకాలో వరద రక్షణ గోడను నిర్మించాలని, వీధుల్లోనీ నీరు ఇండ్లలో కొచ్చి నష్టపోయిన ప్రతి కుటుంబానికి 20వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని లేని పక్షంలో SFI ఆధ్వర్యంలో నష్టపోయిన కుటుంబాలను కలుపుకొని ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు గోపాల్, మణికంఠ, నరసింహ,మధు తదితరులు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: