ఫోటో జర్నలిస్ట్ గంటా శ్రీనివాస్ కన్నుమూత
నివాళులర్పించిన జర్నలిస్టులు
(జానో జాగో వెబ్ న్యూస్- హైదరాబాద్ ప్రతినిధి)
హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఫోటో జర్నలిస్ట్ గంటా శ్రీనివాస్ మృతి చెందారు. ఆదివారం రాత్రి స్వల్ప అస్వస్థకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే గంటా శ్రీనివాస్ తుది శ్వాస విడిచారు. గంటా శ్రీనివాస్ మరణ వార్త వినగానే పాతబస్తీకి చెందిన జర్నలిస్టులందరూ ఆయన నివాసానికి చేరుకుని భౌతిక కాయానికి నివాళులర్పించారు. జర్నలిస్టులు బాబురావు, శ్రావణ్ కుమార్, సర్వేష్ , ఐలేష్, శ్రీనివాస్, సాయి, శివ తదితరులు గంటా శ్రీనివాస్ కు నివాళులర్పించారు. గంటా శ్రీనివాస్ ప్రముఖ దినపత్రికలైనా సాక్షిలో కూడా గతంలో విధులు నిర్వహించారు. ఆయన ప్రస్తుతం సూర్య దినపత్రికలో ఫోటో జర్నలిస్టుగా విధులు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తూ మంచి ఫోటో జర్నలిస్టుగా గంటా శ్రీనివాస్ పేరు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. 15 ఏళ్లు పాటు ఫోటో జర్నలిస్టుగా సేవలందిస్తూ పలువురి మన్ననలను గంటా శ్రీనివాస్ పొందారని వారు పేర్కొన్నారు. గంటా శ్రీనివాస్ మరణం ఫోటో జర్నలిస్టులోకానికి తీరనిలోటని వారు పేర్కొన్నారు. గంట శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు జర్నలిస్టులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
Home
Unlabelled
ఫోటో జర్నలిస్ట్ గంటా శ్రీనివాస్ కన్నుమూత ... నివాళులర్పించిన జర్నలిస్టులు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: