ఆ వివాదం శివసేన కొంప ముంచింది
శివసేన పార్టీ విషయంలో రెండు పిల్లుల పోట్లాట తరహా పరిస్థితి ఉద్దవ్ థాక్రేకు..షిండే వర్గానికి నెలకొంది. ఇదిలావుంటే మహారాష్ట్ర రాజకీయాల్లో సోమవారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. శివసేన పార్టీని సీఎం ఏక్‌నాథ్ షిండే చీల్చగా... ఇప్పుడు శివసేన అన్న పేరు వినిపించని పరిస్థితి నెలకొంది. ఇటు షిండే వర్గంతో పాటు మొన్నటిదాకా ఆ పార్టీ అధినేతగా కొనసాగిన మాజీ సీఎం ఉద్ధవ్ థాకరే.. శివసేన తమదంటే కాదు తమదని వాదులాడుకుంటుకున్నాయి. ఈ పంచాయతీ ఇప్పుడు ఎన్నికల సంఘానికి చేరగా... కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఓ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది.
ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన వర్గానికి శివసేన ఉద్ధవ్ బాలా సాహెబ్ థాకరేగా ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ పార్టీ గుర్తుగా వెలుగుతున్న కాగడా (మాషాల్)ను కేటాయించింది. అదే సమయంలో షిండే ఆధ్వర్యంలోని శివసేన పేరును బాలా సాహెబ్ ఆంచీ శివసేనగా ఈసీ నిర్ణయించింది. అయితే షిండే వర్గానికి చెందిన పార్టీకి గుర్తును కేటాయించని ఈసీ.. షిండే వర్గం అడిగిన గుర్తులు ఇప్పటికే రిజిస్టర్ అయినందున కొత్త ప్రతిపాదనలు పంపాలని సూచించింది. ఇక శివసేన గుర్తు విల్లంబును ఇప్పటికే ఫ్రీజ్ చేసిన ఎన్నికల సంఘం.. ఆ గుర్తును రెండు వర్గాల్లో ఏ ఒక్క వర్గానికి కూడా కేటాయించలేదు.
Home
Unlabelled
ఆ వివాదం శివసేన కొంప ముంచింది
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: