గంటా శ్రీనివాస్ మృతి పట్ల ఓజా సంతాపం
ఫోటో జర్నలిస్ట్ గంటా శ్రీనివాస్ మృతి పట్ల టీయూడబ్ల్యూజే అనుబంధ సంఘమైన ఓల్డ్ సిటీ జర్నలిస్ట్ అసోసియేషన్ (ఓజా) సంతాపం ప్రకటించింది. ఈ మేరకు ఓజా ప్రధాన సలహాదారు వరకాల యాదగిరి(ఐజేయు నేషనల్ కౌన్సిల్ నెంబర్), వి. వెంకటాచారి, అధ్యక్షులు కె.రమేష్, కార్యనిర్వాహక అధ్యక్షులు అమరేశ్వర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బి. భరతా చారి, కోశాధికారి కె.శ్రావణ్ కుమార్, నాయకులు సయ్యద్ నిసార్ అహ్మద్ మాట్లాడుతూ.. గంటా శ్రీనివాస్ ఫోటో జర్నలిస్టుగా పత్రికా రంగానికి ఎనలేని సేవలు చేశారని వారు కొనియాడారు. వృత్తి నిర్వహణను ఎంతో చిత్తశుద్ధితో నిర్వహించి పలువురి నుంచి ప్రశంసలు ఆయన పొందారని వెల్లడించారు. గంటా శ్రీనివాస్ మరణం పత్రికా రంగానికి తీరని లోటని వెల్లడించారు. గంటా శ్రీనివాస ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Home
Unlabelled
గంటా శ్రీనివాస్ మృతి పట్ల ఓజా సంతాపం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: