కొత్త సిద్దేశ్వరం నుండి పారుమంచాల వరకు వెంటనే రోడ్డు నిర్మించాలి

బహుజన సమాజ్ పార్టీ డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి) 

నంద్యాల జిల్లా  జూపాడుబంగ్లా మండలంలోని కొత్త సిద్దేశ్వరం నుండి పారుమంచాల వరకు వెంటనే తారు రోడ్డు వేయాలని బహుజన సమాజ్ పార్టీ నందికొట్కూరు అసెంబ్లీ ఇంచార్జ్ ఎల్ స్వాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కొత్త సిద్దేశ్వరము పారుమాంచాల గ్రామల మధ్య ఉన్న రోడ్డు ను పరిశీలించారు.

ఈ సందర్భంగా స్వాములు మాట్లాడుతూ కొత్త సిద్దేశ్వరం నుండి పారుమంచాల వరకు వెళ్లేందుకు 2019 సంవత్సరం అప్పటి ప్రభుత్వం తారు రోడ్డును మంజూరు చేసిందని, రోడ్డు పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్  రోడ్డు  పై  దాదాపుగా 8 నెలల క్రితం కంకర పరిచి తారు రోడ్డు వేయడం మరిచారని, సిద్దేశ్వరం , పారుమంచాల  గ్రామల రైతులు వారు పండించిన పంటలు,మొక్కజొన్న ,మినుములు ,పత్తి పంటలను ఇంటికి తీసుకెళ్లాలంటే  ఇబ్బందులకు గురవుతున్నారని, మోటార్సైకిల్ ,ఫోర్ వీలర్స్ వాహనలు నడిపే వారకి ప్రయాణం నరక ప్రాయంగా మారిందని  రోడ్డె కాకుండా పాములపాడు మండలంలో శాంతి నిలయం మరియు మిట్టకందాల నుండి బుద్ధ నగర్ వరకు వున్న రోడ్డు మీద కూడా పెద్ద సైజు కంకరపరిచారు వాటిపై తారు రోడ్డు వేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని, తారు రోడ్డు వేయకపోవడం అధికారుల నిర్లక్ష్యమా


లేక పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమా  అని  వాపోయారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే ఈ రోడ్లపై గ్రామాల కు వెళ్లే రహదారులపై తారు రోడ్లను వేయించాలని లేదంటే ఆయా గ్రామాల రైతులను, ప్రజలను అందరినీ కలుపుకొని బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఈ విషయాలపై నంద్యాల జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామాన్ గారిని కలుస్తామని వారు హెచ్చరించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: