మహేశ్వరానికి పర్యాటక శోభ

మంత్రి సబితా ఇంద్రారెడ్డి కృషితో సాకారమవుతున్న కల

హేశ్వరం నియోజకవర్గానికి నిధుల వరద

చెరువుల సుందరికరణ కు రూ.8 కోట్ల నిధులు మంజూరు

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

మహేశ్వరం నియోజకవర్గానికి పర్యాటక శోభ సంతరించుకోనున్నది. ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక కృషితో నియోజెకవర్గంలోని విద్యా, వైద్య, రోడ్లు, లైట్లు, డ్రైనేజీ, తాగు నీరు లాంటి కనీస సౌకర్యాలతో పాటు మహేశ్వరం నియోజకవర్గం పర్యాటక రంగం వైపుకు వడివడిగా అడుగుల వేయబోతోంది.  ఇప్పటికే మీర్ పేట్ చందనం చెరువు మినీ ట్యాంక్ బండ్ గా మారింది....అందంగా సుందరికరించిన చెరువు వద్ద ప్రతి రోజు పెద్ద ఎత్తున సందర్శకులు ఉదయం,సాయంత్రం సేద దిరుతూ,వాకింగ్,వ్యాయామం,చిన్న పిల్లలు అడుకోవటానికి కేరాఫ్ అడ్రస్ గా మారింది.జల్ పల్లి చేరువుతో పాటు మరికొన్ని చెరువుల వద్ద సుందరికరణ,ఓపెన్ జిమ్ లు,రాక్ గార్డెన్ తదితర పనులు శర వేగంగా కొనసాగుతున్నాయి.తాజాగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి సిఫార్సుతో బడంగ్ పేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 5 చెరువుల సుందరికరణకు 8 కోట్ల నిధులు విడుదల చేస్తూ హెచ్ఎండిఏ ఆదేశాలు జారీ చేసింది.బడంగ్ పేట్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్ గూడ లో గల కోమటి కుంట సుందరికరణకు రెండు కోట్ల 50 లక్షలు,పోచమ్మకుంట కు 2 కోట్ల నిధులు,మల్లాపూర్ సుధామోని కుంట చెరువు సుందరికరణకు 2 కోట్లు,గుర్రం గూడ ఎక్కమోని కుంట కట్ట మరమ్మతులకు 50 లక్షలు,కుర్మల్ గూడ చెరువు కట్ట పటిష్టత కోసం 1 కోటి రూపాయల నిధులు విడుదల అయ్యాయి.బడంగ్ పేట్ కార్పొరేషన్ లో 5 చెరువులకు పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు, మంత్రి కేటీఆర్ కు మంత్రి సబితా ఇంద్రారెడ్డి  ధన్యవాదాలు తెలిపారు. మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి ఒక ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్తున్నట్లు,చెరువుల వద్ద ఆహ్లదకరమైన వాతావరణం ఉండేలా, అన్ని తరగతుల వారికి ఉపయోగపడేలా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. నిధుల మంజూరు పట్ల కార్పోరేటర్లు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: