ఆస్తుల విలువ రూ.222.67 కోట్లు...అప్పు రూ.61.5 కోట్లు
మునుగోడు ఉప ఎన్నికల బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఇదిలావుంటే మునుగోడు ఉప ఎన్నికకు కారణమైన మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. నామినేషన్‌లో భాగంగా ఆయన తన ఆస్తుల వివరాలను అఫిడవిట్ రూపంలో జత చేశారు. ఈ అఫిడవిట్ ప్రకారం కోమటిరెడ్డి ఆస్తుల విలువ రూ.222.67 కోట్లుగా తేలింది. కోమటిరెడ్డి తనకు రూ.61.5 కోట్లు అప్పులుగా ఉన్నట్లుగా కూడా వెల్లడించారు. కోమటిరెడ్డి ఆస్తుల్లో స్థిరాస్తుల విలువ రూ.152.69 కోట్లు కాగా...చరాస్తుల విలువ రూ.69.97 కోట్లుగా ఆయన పేర్కొన్నారు. తన సతీమణి ఆస్తుల విలువ రూ.52.44 కోట్లుగా కోమటిరెడ్డి వెల్లడించారు.
Home
Unlabelled
ఆస్తుల విలువ రూ.222.67 కోట్లు...అప్పు రూ.61.5 కోట్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: