ఈనెల 22.. 23 తేదీల్లో ఎస్ ఐ ఓ స్టేట్ కాన్ఫరెన్స్
(జానో జాగో వెబ్ న్యూస్- హైదరాబాద్ ప్రతినిధి)
ఈనెల 22 23వ తేదీల్లో ఎస్ ఐ ఓ స్టేట్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు ఆ సంస్థ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ తల్హా ఫయాజుద్దీన్, కార్యదర్శి జుబేర్ వెల్లడించారు. ఈ సందర్భంగా వారు కాన్ఫరెన్సు గోడపత్రికలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఈ నెల 22, 23 శని, ఆదివారాల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఎస్ఐవో సంస్థ నిర్వహించే సదస్సులో ప్రముఖుల ప్రసంగాలుంటాయని ఆ సంస్థ కార్యదర్శి తెలిపారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, జమాఅతె ఇస్లామీహింద్ స్టేట్ ప్రెసిడెంట్ మౌలానా హామిద్ ముహమ్మద్ ఖాన్, ఎస్ఐవో (స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్) స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ తల్హా ఫయాజుద్దీన్ విద్యార్థులు, యువతనుద్దేశించి ప్రసంగిస్తారని అన్నారు. రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సులో చిన్న పిల్లలు, యువకులు, విద్యార్థుల కోసం వేర్వేరు కార్యక్రమాలుంటాయని అన్నారు. విద్యార్థుల కెరీర్ గైడెన్స్ కోసం ప్రత్యేక ప్రదర్శన ఉంటుందన్నారు.
Home
Unlabelled
ఈనెల 22.. 23 తేదీల్లో ఎస్ ఐ ఓ స్టేట్ కాన్ఫరెన్స్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: