ఒకే ఒక్కడు హాజరు

ఎస్సార్బీసి ఖ్వాలిటి కంట్రోల్ 2 కార్యాలయంలో "ఒక్కరే" హాజర్.

రిజిస్టర్లో ఒకే ఒక సంతకం...ఒకరు లీవ్....14 మందిలో 12 మంది డుమ్మా.

నంద్యాల పట్టణ శివారులో ఎస్ఆర్బిసి కార్యాలయంలో వింత లీలలు

అడిగే వారెవరు.. పట్టించుకునే వారెవరు అనే ధీమానే సిబ్బంది గైహాజరయ్యారుకు కారణమా

(జానో వెబ్ జాగో న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

 ప్రభుత్వ ఉద్యోగం...మంచి జీతం...పనులు అంతంత మాత్రమే...పట్టణానికి శివారులో ని ఎస్సార్బీసి ఖ్వాలిటి కంట్రోల్ కార్యాలయంలో అధికారులు డుమ్మా కొట్టారు.14 మంది పనిచేస్తున్న కార్యాలయంలో   జూనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్ హాజర్ కాగా,టెక్నికల్ అధికారి పివి రమణారావు సెలువుపెట్టారు. కార్యాలయానికి హెడ్ ఈఈ రాజశేఖర్ కర్నూల్,నంద్యాల కు ఆయనే కావడంతో నంద్యాలలో లేకపోవడంతో కర్నూల్ లో విధులు నిర్వహిస్తున్నారని అటెండర్ చెప్పుకొచ్చారు.శనివారం కార్యాలయం ఉన్నప్పటికీ మధ్యాహ్నం 12.30 వరకు కార్యాలయం లో కుర్చీలు ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి.


అటెండెన్స్ రిజిస్టర్లో ఒకరు హాజరైనట్లు మరొకరు సెలవుపెట్టినట్లు రిజిస్టర్లో కనపడుతుంది.అధికారులు లేనప్పటికీ ఫ్యాన్లు మాత్రం తమ పని తాము చేసుకుంటున్నట్లు తిరుగుతున్నాయి. కార్యాలయంలో కొందరు నందికొట్కూరు,కర్నూల్ నుంచి రోజు విధులకు హాజరవుతున్నారు.కార్యాలయంలో సూపరింటెండెంట్ శ్రీనివాసులు,సీనియర్ అసిస్టెంట్స్ మాధవ రావు,కె.ఎల్.కాంతా రెడ్డి,ఎం లీలావతి,జూనియర్ అసిస్టెంట్ శిరోమని,టైపిస్టులు గాయత్రి,రమణా రెడ్డి,రికార్డ్ అసిస్టెంట్ మంజుల, వెంకట లక్షమ్మ లు హాజరు కాలేదు.

ఆఫీస్ అటెండర్ వినోద్ కుమార్ వచ్చి ఆఫీస్ పనిమీద బయటికి వెళ్లారని చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా ప్రభుత్వ కార్యాలయంలో జీతాలు తీసుకుంటున్న అధికారులు హాజరు కాకపోతే సెలవు చీటీలు సమర్పించాల్సింది ఉండగా తమ కార్యాలయం దూరంగా ఉండడంతో ఎవరు రారు అనే ధైర్యంగా ఉంటున్నట్లు కనబడుతుంది, ప్రభుత్వ కార్యాలయాల్లో సమయపాలన పాటించడంలేదనే విమర్శలు నంద్యాల పట్టణ ప్రజల నుండి వినిపిస్తున్నాయి.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: