జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు
మండల స్థాయి ఆటల పోటీలలో ఎంపికలు
(జానో జాగో వెబ్ న్యూస్ -నంద్యాల జిల్లా ప్రతినిధి)
గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉత్తర్వుల ప్రకారం నంద్యాల జిల్లా గడివేముల మండలం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు విద్యార్థిని, విద్యార్థులకు 18 వ తేదీ నుండి ఆటల పోటీలలో మండల స్థాయి ఎంపికలు జరుగుతున్నట్లు రవికుమార్ పిడి, స్వామి దాసులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
18-10-2022 మంగళవారం ఎంపికలు జరుపు క్రీడాంశాలు త్రోబాల్,బాల్ బాడ్మింటన్,యోగా,టెన్నికాట్,అథ్లెటిక్స్ పోటీలు జరుగుతాయని,
19-10-2022 బుధవారం ఎంపికలు నిర్వహణ జరుపు క్రీడాంశాములు
కబడ్డీ,ఖో-ఖో,వాలీబాల్,బ్యాడ్మింటన్
గేమ్స్ నందు మండల స్థాయి ఎంపికలు నిర్వహిస్తామని, మండల స్థాయిలో ఎంపికైన క్రీడాకారులు నియోజకవర్గ స్థాయి లో పాల్గొంటారని, నియోజకవర్గ స్థాయిలో ఎంపికైన క్రీడాకారులు జిల్లా స్థాయి జట్టుకు ఎంపిక చేయడం జరుగుతుందని
18-10-22నుండి 19-10-22 వరకు మండల స్థాయి క్రీడాకారుల ఎంపిక పోటీలో
20-10-22 నుండి24-10-22 వరకు నియోజకవర్గం స్థాయి క్రీడాకారుల ఎంపిక పోటీలు
24-10-22 నుండి నవంబర్ 3-11-22 వ తేది వరకుజిల్లా స్థాయి ఎంపిక ఆటల పోటీలు జరుగుతాయని.
అన్ని గేమ్స్ కు డైరెక్ట్ జిల్లా సెలక్షన్లు ఉండును.
మండలంలోని ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న మరియు ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న PD మరియు PET విద్యార్థిని,విద్యార్థులను పోటీలకు సన్నద్ధం చేసి క్రీడా ప్రాంగణానికి విద్యార్థిని, విద్యార్థులను తీసుకొని రావాలని, పోటీలలో పాల్గొనే
క్రీడాకారులు క్రీడలకు సంభందించిన కిట్లు ఎవరివి వారే తెచ్చుకొనవలెనని, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొనే క్రీడాకారుల పాఠశాల గుర్తింపు కార్డులు తీసుకొని రావలెనని,
పోటీలలో పాల్గొనే క్రీడాకారులకు భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగిందని, క్రీడాకారులు ఎవరి ప్లేట్లు వారే తేచ్చుకొనవలెనని, పోటీలలో పాల్గొనే క్రీడాకారుల
వయస్సు ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలిని తెలిపారు.
Home
Unlabelled
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు .. మండల స్థాయి ఆటల పోటీలలో ఎంపికలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: