పోలీస్ వర్సెస్ హర్యాణా మహిళా కమిషన్


హర్యాణా రాష్ట్రంలో ఓ సమావేశంలో ఇద్దరు మహిళా ఆఫీసర్ల మధ్య శుక్రవారం వాగ్వాదం చోటుచేసుకుంది. హర్యాణా  మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేణు భాటియా.. ఓ మహిళా పోలీస్ ఆఫీసర్‌పై రెచ్చిపోయారు. ఈ మేరకు రేణు భాటియా పోలీసు అధికారిని మీటింగ్ నుంచి బయటకు వెళ్లమని గద్దించారు. కెమెరాల ముందు జరిగిన ఈ దారుణమైన గొడవ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కైతాల్‌లో శుక్ర‌వారం మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేణు భాటియా ఆధ్వర్యంలో ఓ స‌మావేశం జ‌రిగింది. రేణు దృష్టికి భార్యాభర్తల సమస్య వచ్చింది. శారీరకంగా తాను సరిగ్గా లేనని భర్త వేధిస్తున్నాడని, తన నుంచి విడాకులు కోరుతున్నాడని ఓ మహిళ రేణు భాటియాకు ఫిర్యాదు చేసింది. తనకు మూడుసార్లు వైద్య పరీక్షలు నిర్వహించారని తెలియజేసింది. కానీ ఆమె భర్త ఒక్కసారి కూడా టెస్టులు చేయించుకోలేదు.

ఈ నేపథ్యంలో భార్యను ఇంతగా వేధిస్తున్న అతడిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని పోలీసు అధికారిణిని రేణు భాటియా ప్రశ్నించారు. ఆమెపై నిప్పులు చెరిగారు. దీనికి ఆ మహిళా పోలీసు అధికారి వివరణ ఇవ్వబోతుండగా.. "గెట్ అవుట్" అని రేణు భాటియా గద్దించారు. పైగా "మీరు చెప్పేది నేను వినద‌ల్చుకోలేదు. బయటకు వెళ్లండి.. తిరిగి సమాధానం చెప్పవద్దు" అని రేణు అన్నారు. పైగా మీరు విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

దాంతో ఆ పోలీసు అధికారి కూడా తన వాదనకు దిగారు. ఈ క్రమంలో ఆ పోలీసు ఆఫీస‌ర్‌ను బ‌ల‌వంతంగా మ‌రో ఆఫీస‌ర్ బ‌య‌ట‌కు పంపించారు. దీనిపై రేణు భాటియా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ కేసు భార్యాభర్తల మధ్య వివాదానికి సంబంధించినదని, కమిషన్ సభ్యులతో, పోలీసులతో కూడా మహిళ భర్త చాలాసార్లు దురుసుగా ప్రవర్తించాడని చెప్పారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: