గడివేముల మండలంలో ఘనంగా... గణేష్ నిమజ్జోత్సవాలు

(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల కేంద్రము ఈయన గడివేములలో ఘనంగా వినాయక నిమర్జనం ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నాలుగు రోజులపాటు విశేష పూజలు అందుకున్న వినాయక విగ్రహాలు గంగమ్మ చెంతకు చేరాయి. వినాయక చవితి పండుగ సందర్భంగా గడివేములలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో పిల్లలు, యువకులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని ఆనందాన్ని వ్యక్తం చేశారు.


వినాయక నిమజ్జన ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గడివేముల ఎస్సై బీ.టీ. వెంకటసుబ్బయ్య తన సహచర పోలీస్ సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు  చేసి శాంతి భద్రతలను పర్యవేక్షించారు. యువకుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు వారితో  కలిసి నృత్య ప్రదర్శనలు చేసి ఉత్సాహ పరిచారు.





Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: