బీజేపీ కార్యాలయానికి గద్దర్


బీజేపీ కార్యాలయానికి ప్రజా గాయకుడు గద్దర్ వెళ్లారు. ఇది నిజంగా కాస్త వండర్ విషయమే. జన వాగ్గేయకారుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ హైదరాబాదులో బీజేపీ ప్రధాన కార్యాలయానికి విచ్చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని కలిశారు. ఇరువురి మధ్య కాసేపు చర్చ జరిగింది. ఢిల్లీలోని నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టేలా కృషి చేయాలని బండి సంజయ్ ను గద్దర్ కోరారు. ఈ అంశాన్ని పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తాలని విజ్ఞప్తి చేశారు. 

నూతన పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టే విషయమై ఇటీవల రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. ఈ అంశాన్ని పార్లమెంటులో చర్చకు తీసుకువచ్చేలా తీర్మానం చేశాయి. ఈ క్రమంలోనే గద్దర్ నేడు బీజేపీ ఆఫీసుకు వచ్చి బండి సంజయ్ ని కలిశారు. ఇదిలావుంటే  రొటీన్ కు భిన్నంగా కొత్త గెటప్ లో వచ్చిన గద్దర్ ను తొలుత బీజేపీ ఆఫీసులో కొందరు గుర్తుపట్టలేకపోయారు. బండి సంజయ్ కూడా గద్దర్ ను చూసి ఆశ్చర్యపోయారు. "కొత్త లుక్ లో కనబడుతున్నవ్" అంటూ పలకరించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: