దండలు మార్చుకొని ఒకటయ్యారు...నలుగురికి ఆదర్శంగా నిలిచారు


కార్పోరేటర్ కొడుకు పెళ్లి అంటేనే సంబరాలు అంబరానికి తాకుతాయి. అలాంటి ఓ మేయర్..ఒక ఎమ్మెల్యే పెళ్లి చేసుకొంటే ఆ వేడుక ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కానీ అందరి ఊహలను పటాపంచలు చేస్తూ కేరళలోని ఓ జంట తమ వివాహం సాదాసీదాగా జరుపుకొంది. అంత్యంత చిన్న వయస్సులో మేయర్‌గా, ఎమ్మెల్యేగా పదవీ బాధ్యతలను చేపట్టిన.. ఆర్యా రాజేంద్రన్, సచిన్ దేవ్‌ల తమ పెళ్లి విషయంలో కూడా అందరికి ఆదర్శంగా నిలిచారు. చాలా నిరాండంబరంగా, సింపుల్‌గా పెళ్లి చేసుకున్నారు. మేళతాళాలు లేవు.. మంత్రాలు లేవు.. కేవలం దండలు మార్చుకోవడంతో వివాహ తంతును ముగించారు.

తిరువనంతపురం మేయర్ ఆర్యా రాజేంద్రన్, బాలుశెరి ఎమ్మెల్యే కేఎం సచిన్ దేవ్‌ ఆదివారం ఉదయం 11 గంటలకు ఏకేజీ సెంటర్‌లో జరిగింది. అందరి సమక్షంలో వేదిపై.. పార్టీ నాయకులు ఇచ్చిన దండలను ఒకరికొకరు మార్చుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖుల నేతలు, బంధువులు, స్నేమితులు వారిద్ధరికి అభినందనలు తెలియజేశారు.

అనంతరం అతిథులకు చిన్న టీ పార్టీ మాత్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్‌ సహా సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. పెళ్లికి ఎలాంటి కానుకలు స్వీకరించబోమని వారు ఇంతకు ముందే ప్రకటించారు. ఎవరైనా గిఫ్ట్‌లు ఇవ్వాలనుకుంటే.. వాటిని వృద్ధాశ్రమాలకు, ముఖ్యమంత్రి సహాయనిధికి ఇవ్వాలని వారిద్దరూ ముందే తెలియజేశారు. వారు ఇచ్చిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అయింది.

సచిన్‌దేవ్, ఆర్యా రాజేంద్రన్‌లు అతి చిన్న వయస్సులో రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరూ తమ తమ స్థానాలకు పోటీ చేసి గెలుపొందారు. సచిన్ దేవ్ కోజికోడ్‌లో పుట్టారు. లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు, సీపీఎం చాల ఏరియా కమిటీ సభ్యుడుగా కూడా పనిచేశారు. ఆర్యా రాజేంద్రన్ 21 ఏళ్లకే మేయర్ అయ్యారు. తిరువనంతపురంలోని ఆల్ సెయింట్స్ కాలేజీలో విద్యార్థిగా ఉన్నప్పుడే మేయర్ అవ్వడంతో ఆమె సంచలనం సృష్టించింది. ఆర్య, సచిన్ చిన్నప్పటి నుంచి ఒకరికొకరు మంచి స్నేహితులు. ఒక్కటే అభిప్రాయాలతో పార్టీలో పనిచేశారు. ఒకరి అభిప్రాయాలు మరొకరి నచ్చడంతో.. అందరికి ఆదర్శప్రాయంగా నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. మార్చి 6న వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. ఆదివారం వీరి పెళ్లి జరిగింది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: