నాలుకను నైవేద్యంగా పెట్టేడు ఓ భక్తుడు


తనలో నింపుకొన్న బతిని ప్రదర్శించే క్రమంలో ఓ భక్తుడు ప్రాణాల మీదకు తెచ్చుకొన్నాడు. ప్రతి వ్యక్తిలో దైవం పట్ల భక్తి ఉంటుంది. కానీ కొందరు మాత్ర మూఢ భక్తితో ఉంటారు. ఆ మూఢత్వంతో వారేం చేస్తారో.. వాళ్లకే అర్థం కాదు. దేవుళ్లపై అంధభక్తితో.. నరబలులు ఇచ్చిన సంఘటనలు కూడా అనేకం ఉన్నాయి. లేదా తమను తాము హింసించుకుంటూ ఉంటారు. ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది.. తన భక్తితో ఓ వ్యక్తి.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఆలయంలో దేవతకు తన నాలుకను కోసి సమర్పించాడు.

కౌశాంబి జిల్లాలో మా షీట్ల ఆలయానికి  సంపత్ (38), భార్య బన్నో దేవితో కలిసి శనివారం వెళ్లాడు. దేవతను సందర్శించే ముందు అక్కడి గంగానదిలో పవిత్రంగా స్నానం చేశాడు. అనంతరం ఆలయంలో పొర్లుదండాల ప్రదక్షిణలు చేశాడు. తర్వాత వెంట తెచ్చిన బ్లేడ్‌తో నాలుక కోసుకున్నాడు. ఆలయం ప్రధాన ద్వారం వద్ద తెగిన నాలుకను ఉంచి దేవతకు నైవేద్యంగా సమర్పించాడు. దాంతో సంపత్‌కు తీవ్ర రక్తస్రావం అయింది. వెంటనే సంపత్‌ను జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు కర్హా ధామ్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అభిలాష్ తివారీ తెలిపారు.

దీనిపై సంపత్ భార్య బన్నోదేవీ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. శుక్రవారం రాత్రే ఆలయాన్ని సందర్శించాలని సంపత్ తనతో అన్నాడని చెప్పింది. అనుకున్న విధంగా శనివారం ఆలయానికి వచ్చామని, అయితే ఇలా నాలుక కోసుకుంటాడని తాను ఊహించలేదని చెప్పింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సంపత్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: