న్యూస్ చెప్పేందుకు ఆటకం కలగకూడదని...ఏకంగా ఈగనే మింగేసింది

 


కెమెరా ముందు కూర్చోని వార్తలు చెప్పడం అంటే మాటలు కాదు. అది ఓ సవాల్ గానే చెప్పవచ్చు.  ఇదిలావుంటే న్యూస్ చదవే ఓ న్యూస్ రీడర్ తన విధి నిర్వాహణ లో చిత్తశుద్దిని కనబర్చింది. అదే ఇపుడు ఆసక్తికర అంశంగా మారింది. ఆన్ ఎయిర్‌లో ఒక్కసారి న్యూస్ చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత న్యూస్ రీడర్లు ఏ ఆటంకం వచ్చినా మధ్యలో ఆపరు. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. వారి పని వారు చేసుకుంటూ పోతారు. చూసే ఆడియన్స్‌కు ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా తమ డ్యూటీని విజయవంతంగా నిర్వర్తిస్తారు. అలా ఓ న్యూస్ యాంకర్.. టీవీలో వార్తలు చెబుతుండగా ఓ ఈగ ఆమెను సతాయించింది. దానిని ఆమె ఏం చేసిందో తెలుసా.. తెలిస్తే.. బాబోయ్ అంటారు. ఎందుకంటే.. ఆ ఈగను ఆమె మింగేసింది. అలా మింగేసి.. తన డ్యూటీని తను కొనసాగించింది.

కెనడియన్ జర్నలిస్ట్ ఫరా నాసర్ పాకిస్థాన్‌లోని వరదల గురించి రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోను ఆమె ట్విట్టర్‌లో షేర్ చేసింది. పాకిస్థాన్‌లో వర్షాలు ఎలా విధ్వంసం సృష్టిస్తున్నాయో నాసర్ రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు ఆమె నోటిలోకి ఈగ వచ్చింది. "పాకిస్థాన్ ఎప్పుడూ ఇలాంటి వర్షాలను చూడలేదు. ఎనిమిది వారాలుగా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. దాంతో ప్రభుత్వం అక్కడ ఎమర్జెన్సీని విధించింది." అని నాసర్ చెబుతుండగా ఆమె నోటిలోకి ఈగ రావడంతో దానిని చటుక్కున్న మింగేసింది. వెంటనే తన టాస్క్‌ను తాను కొనసాగించింది.

అయితే నాసర్ ఈ విషయాన్ని చాలా తేలికగా తీసుకున్నారు. "ఈరోజుల్లో మనమందరం నవ్వాల్సిన అవసరం ఉన్నందున ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. నేను ఈగను మింగాను." అని క్యాప్షన్ పెట్టి వీడియోని షేర్ చేసింది. ఈ వీడియోని 99,000 కంటే ఎక్కువ మంది చూశారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది వెల్‌ డన్ అంటూ కామెంట్ పెట్టగా.. కొంతమంది అది ఇంతకీ ఏ ఈగ..? అంటూ ప్రశ్నిస్తూ కామెంట్ పెట్టారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: