ఉచిత రేషన్ ఎగ్గొట్టొద్దు- పేదల కడుపు కొట్టవద్దు
గడివేముల మండల టిడిపి కన్వీనర్ దేశం సత్యనారాయణరెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)
నంద్యాల జిల్లా, గడివేముల మండల పరిధిలోని స్థానిక మండల మేజిస్ట్రేట్ కార్యాలయం నందు టిడిపి పాణ్యం మాజీ శాసనసభ సభ్యురాలు గౌరు చరితా రెడ్డి ఆదేశాల మేరకు గడివేముల మండల టిడిపి కన్వీనర్ దేశం సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఉచిత రేషన్ ఎగ్గొట్టొద్దు-పేదల కడుపు కొట్టవద్దు అనే నినాదంతో తాసిల్దార్ కార్యాలయం నందు ఆర్ఐ. శ్రీనివాసులుకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గడివేముల మండల కన్వీనర్ దేశం సత్యనారాయణరెడ్డి, స్టేట్ మైనారిటీ సెల్ సెక్రెటరీ ఫారుఖ్ బాషా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 1. 47 కోట్ల రేషన్ లబ్ధిదారుల కార్డులు ఉండగా వాటిని 1.44 కోట్ల రేషన్ లబ్ధిదారుల కార్డులకు కుదించారని, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం క్రింద 89 లక్షల మందికి మాత్రమే ఉచిత బియ్యం ఇస్తున్నారని, 55 లక్షల కార్డు లబ్ధిదారులను తీసివేశారని,
కేంద్రం ఇచ్చిన ఉచిత రేషన్ బియ్యాన్ని పేదలకు పంచకుండా పక్కదారి పట్టిస్తున్నారని, రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి కాకినాడ, కృష్ణపట్నం, చెన్నై, ముంబై, పోర్టులకు తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దేశం నరేంద్ర రెడ్డి, నాగశేషులు (ఎస్సీ సెల్), గపూర్ (పార్లమెంట్ మైనారిటీ సెక్రటరీ ),ఈశ్వర్ రెడ్డి (మాజీ మండల ఉపాధ్యక్షులు), తిరుపాడు రాజు,కొర్రపోలురు జయరాం, శ్రీనివాసరెడ్డి, విజయకుమార్, గడివేముల మండలంలోని టిడిపి కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
Home
Unlabelled
ఉచిత రేషన్ ఎగ్గొట్టొద్దు- పేదల కడుపు కొట్టవద్దు గడివేముల మండల టిడిపి కన్వీనర్ దేశం సత్యనారాయణరెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: