హర్ ఘర్ తిరంగా నినాదంతో...
తిరుపాడు గ్రామంలో వజ్రోత్సవ వేడుకలు
(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)
నంద్యాల జిల్లా, గడివేముల మండల పరిధిలోని తిరుపాడు గ్రామంలో ఆజాదీ కా అమృత్ వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు వివరాల లోకి వెళ్తే తిరుపాడు గ్రామంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు *హర్ ఘర్ తిరంగా* నిదానంతో తిరుపాడు గ్రామానికి చెందిన టిడిపి నాయకులు యుగంధర్ రెడ్డి, *రాజు (రిటైర్డ్ ఆర్మీ ), (ఐటీడీపీ ఆదికార ప్రతినిధి,పాణ్యం నియోజక వర్గం)*, కార్యకర్తలు తిరుపాలు, హరి, జగదీష్, సుధీర్ బాబు, మదార్ వలి, వడ్డే రమేష్ గ్రామంలోని పురవీధులలో పిల్లలతో జాతీయ జెండాలను పంచి పిల్లలతో ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని వారిలో దేశభక్తిని చిన్నతనం నుండే పెంపొందించుకునే విధంగా ప్రతి విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గ్రామంలోని పెద్దలకు భారతదేశానికి స్వాతంత్రం ఎలా వచ్చిందో వివరిస్తూ ర్యాలీ నిర్వహించారు. తిరుపాడు గ్రామంలోని విద్యార్థిని, విద్యార్థులు భారత్ మాతాకీ జై అనే నినాదంతో ఆజాదీ కా అమృత్ వజ్రోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
Home
Unlabelled
హర్ ఘర్ తిరంగా నినాదంతో... తిరుపాడు గ్రామంలో వజ్రోత్సవ వేడుకలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: