పాత నగరంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి
ఎన్టీఆర్ అభిమానుల ఆత్మీయ సమ్మేళనంలో వక్కల డిమాండ్
(జానో జాగో వెబ్ న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి)
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో మంగళ వారం సైదాబాద్ కాలనీలో ని సింగిరెడ్డి కమ్యూనిటీ హాల్ లో ఎన్టీఆర్ అభిమానుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు వరకాల యాదగిరి, వింజమూరి వెంకటాచారి, గౌస్ తో పాటు వివిధ రంగాల్లో సమాజానికి సేవలు అందిస్తున్న వారికి తెలుగు దేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు చేతుల మీదుగా ఎన్టీఆర్ ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు.
పాతనగర ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ నాగు నగేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘాల సమాఖ్య అధ్యక్షుడు పి.సాయిబాబా, తెదేపా నాయకులు , ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ కు భారత రత్న అవార్డు ఇవ్వాలని, పాతనగరంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ప్రసంగించిన వక్తలు కోరారు.
Home
Unlabelled
పాత నగరంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి ... ఎన్టీఆర్ అభిమానుల ఆత్మీయ సమ్మేళనంలో వక్కల డిమాండ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: