పీర్ల పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి...
పాణ్యం ఇన్చార్జి సీఐ ఇస్మాయిల్
(జానో జాగో వెబ్ న్యూస్- గడివేముల ప్రతినిధి)
నంద్యాల జిల్లా, గడివేముల మండలం పరిధిలోని పెసర వాయి గ్రామంలో మొహరం పండుగ ను జరుపు కొనుటకు గ్రామ పెద్దలు, పీర్ల చావిడి ధర్మకర్త శివారెడ్డి, ఎల్లారెడ్డి, మధు రెడ్డి, పెసరవాయీ గ్రామ ప్రెసిడెంట్ ఎర్రగుడి శేఖర్, ఎంపీటీసీ సైమన్ లు గడివేముల ఎస్సై బిటి. వెంకటసుబ్బయ్య ని అనుమతి కోరగా, పాణ్యం ఇంచార్జి సిఐ ఇస్మాయిల్, ఫ్యాక్షన్ జోన్ ఎస్ఐ హరి ప్రసాద్, గడివేముల ఎస్సై బిటి. వెంకటసుబ్బయ్య పెసర వాయి గ్రామాన్ని సందర్శించి గ్రామ పెద్దలతో చర్చించారు.
ఈ సందర్భంగా పాణ్యం ఇన్చార్జి సీఐ ఇస్మాయిల్, యాక్షన్ జోన్ ఎస్సై హరిప్రసాద్ లు గ్రామ పెద్దలతో మాట్లాడుతూ మొహరం పండగ హిందూ ముస్లింలకు సోదరుభావాన్ని, మతసామరస్యాన్ని చాటి చెప్పుకునే పండగని ఈ పండగలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మొహరం పండుగను భక్తిశ్రద్ధలతో ప్రశాంతంగా జరుపుకోవాలని గ్రామ ప్రజలకు మరియు గ్రామ పెద్దలకు సూచించారు.
Home
Unlabelled
పీర్ల పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి... పాణ్యం ఇన్చార్జి సీఐ ఇస్మాయిల్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: