ముస్తాబు అవుతున్న... వినాయక మండపాలు
(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)
నంద్యాల జిల్లా, గడివేముల మండలంలోని 18 గ్రామాలలో వినాయక చవితి విగ్రహ మండపాలు చిన్నపిల్లల కేరింతలతో, రంగురంగుల అలంకరణలతో చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ కలిసి మండపాలనుముస్తాబు చేస్తున్నారు. గడివేముల బీసీ కాలనీలోని గణేష్ యూత్ వారు 31-08-22 వ తేదీ సాయంత్రం06:00 గంటలకు స్లో బైక్ రైసులు నిర్వహిస్తున్నారు.01-09-22 వ తేదీ సాయంకాలం 08:00 గంటలకు చెక్కభజన కార్యక్రమం ఉంటుందని,02-09-22 వ తేదీన సాయంకాలం 08:00 గంటల నుండి అన్నదాన కార్యక్రమాన్ని, అన్నదాన కార్యక్రమానంతరం ఉట్టి కొట్టే కార్యక్రమం ఉంటుందని ఈ కార్యక్రమానికి గడివేముల గ్రామం లోని ప్రజలందరూ పాల్గొనాలని శ్రీ వినాయకుని ఆశీస్సులు అందుకోవాలని బీసీ కాలనీ గణేష్ యూత్ కమిటీ వారు తెలియజేశారు.
Home
Unlabelled
ముస్తాబు అవుతున్న... వినాయక మండపాలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: