వినాయక చవితి వేడుకలకు అనుమతులు తప్పనిసరి

గడివేముల ఎస్సై బి.టి. వెంకటసుబ్బయ్య

(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల  ప్రతినిధి)

గడివేముల మండలంలో జరుపుకునే వినాయక చవితి ఉత్సవాలకు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని గడివేముల ఎస్ఐ. బీ.టీ. వెంకటసుబ్బయ్య తెలిపారు.  ఆయన మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామాలలో ప్రజలు వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విగ్రహాల కమిటీ వారే జాగ్రత్తలు వహించాలన్నారు. ఉత్సవాలకు మూడు రోజుల అనుమతి మాత్రమే ఉంటుందని ఎక్కడ కూడా డీజేలు పెట్టరాదన్నారు. నిమజ్జనం చేసుకునే ప్రాంతాలలో  జాగ్రత్తగా ఉండే విధంగా కమిటీ సభ్యులే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మద్యం సేవించి నిమజ్జోత్సవాలలో పాల్గొనరాదన్నారు. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: