గని గ్రామంలో...గడప గడపకు మన ప్రభుత్వం
(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)
పాణ్యం ఎమ్యెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా ,గడివేముల మండల పరిధిలోని గని గ్రామంలో గడప,గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. గని గ్రామంలోని ప్రతీ గడపకు వెళ్లి రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న జనరంజక పాలన,అవినీతి రహిత పాలన గురించి ప్రజలకు వివరిస్తూ జగనన్న ప్రభుత్వాన్ని దీవించాలని కోరారు.ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికి అందేలా చూడాలని సంబంధిత సచివాలయ సిబ్బందిని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ సర్పంచ్ కత్తి తులశమ్మ ,ఎంపీపీ నాగ మద్దమ్మ, గడివేముల జడ్పీటీసీ ఆర్.బి.చంద్రశేఖర్ రెడ్డి , గని గ్రామ వైసీపీ నాయకులు శివానంద రెడ్డి, ప్రతాప్ రెడ్డి, మేఘనాథ్ రెడ్డి, రామ లింగేశ్వర రెడ్డి, రవీంద్ర రెడ్డి, పెసరవాయి శ్రీకాంత్ రెడ్డి, వైసిపి నాయకులు,కార్యకర్తలు,సచివాలయ సిబ్బంది,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Home
Unlabelled
గని గ్రామంలో...గడప గడపకు మన ప్రభుత్వం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: